టాలీవుడ్లో చిన్న డిస్ట్రిబ్యూటర్‌గా మొదలుపెట్టి.. ఇప్పుడు ఇండస్ట్రీలో నంబర్ వన్ ప్రొడ్యూసర్‌గా ఎదిగాడు దిల్ రాజు. నిర్మాతగా 20 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న తరుణంలో వరుసగా విజయాలతో మంచి ఊపు మీద ఉన్నాడు రాజు. ఐతే ఈ 20 ఏళ్లలో దిల్ రాజు అనేక సందర్భాల్లో విమర్శలు, ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. థియేటర్ల మీద ఆధిపత్యం సహా అనేక అంశాలకు సంబంధించి తరచుగా ఆయన మీద వివాదాలు చెలరేగుతుంటాయి. చాలా వరకు వాటి మీద రాజు స్పందించడు.
ఈ మధ్య మాత్రం తన పేరు వివాదాల్లో చిక్కుకుంటే వివరణ ఇవ్వడంతో పాటు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నాడు రాజు. తన మీద అకారణంగా ద్వేషం చూపిస్తుంటారని.. కావాలనే వివాదాలు రాజేస్తుంటారని.. తాను మంచి చేయాలని చూసినా కూడా నెగెటివ్ కామెంట్లు తప్పట్లేదని తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాజు ఆవేదన వ్యక్తం చేశారు.
“నేను అదృష్టవశాత్తూ సోషల్ మీడియాలో లేను. అక్కడ ఉండటం నాకు నచ్చదు. కానీ నా టీం సభ్యులు అక్కడ వచ్చే కామెంట్లను నా దృష్టికి తెస్తుంటారు. వంద కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో ఎవరో ఏదో అంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదని వారితో చెబుతుంటా. ఏ విషయంలో తప్పు చేయకుండా ఉండటానికే ప్రయత్నిస్తా. ఒక వేళ నా వల్ల తప్పు జరిగితే బహిరంగ క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉంటాను. కానీ ఈ మధ్య కొందరు కావాలనే వ్యక్తిగతంగా నా పేరు దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారు. నేను కేవలం సినిమాలు తీసుకోవడానికి పరిమితం అయితే ఎవరికీ ఏ బాధా ఉండదు. కానీ నేను ప్రతి చోటా ఉంటాను. నేను సినిమాల రిలీజ్ విషయంలో శాసిస్తాను అంటుంటారు. నేనెవరిని శాసించడానికి? నేను ఏదైనా ఇండస్ట్రీ మేలు కోరుతూ మంచి సలహా ఇచ్చినా కూడా కామెంట్లు చేస్తున్నారు” అని రాజు ఆవేదన చెందాడు.
This post was last modified on April 6, 2023 4:32 pm
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…