మంచు మనోజ్ కు కోపం వచ్చింది. ఇవాళ జరిగిన ఒక ఈవెంట్ కి అతిథిగా వచ్సిన తరుణంలో మీడియా నుంచి ఎదురైన ప్రశ్నలకు సంయమనం కోల్పోయి మాట జరగడం పలు విమర్శలకు దారి తీసింది. సినిమాలు చేసినా చేయకపోయినా మనోజ్ పట్ల ఒకరకమైన సాఫ్ట్ కార్నర్ అటు అభిమానుల్లో ఇటు సాధారణ జనంలోనూ ఉంది. అలాంటిది అతను కంట్రోల్ తప్పడం విచిత్రమే. అయితే ఇలాంటి దూకుడు తనకు కొత్తేమీ కాదు. పలు సందర్భాల్లో అప్పుడప్పుడు మాట తూలినా అది పరిమిత హద్దుల్లోనే ఉంది. కానీ ఈసారి ఎందుకనో అదుపు తప్పేశాడు.
ఇటీవలే అన్నయ్య మంచు విష్ణు తన బంధువుల మీద దాడి చేసినట్టు మనోజ్ ఒక వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అది డిలీట్ చేసే లోపు ట్విట్టర్ మొత్తం వైరల్ అయిపోయింది. కొన్ని న్యూస్ ఛానల్స్ ఏకంగా డిబేట్లు పెట్టాయి. ఓసారి బయట కనిపించిన మనోజ్ ని ఇదే ప్రశ్న అడిగితే నాకంటే మీకే ఎక్కువ తెలుసంటూ తప్పించుకున్నాడు. కొద్దిరోజుల క్రితం విష్ణు ఒక చిన్న టీజర్ ని రిలీజ్ చేసి అదంతా ప్రాంకని త్వరలోనే రాబోయే రియాలిటీ సిరీస్ లో భాగంగా అది తీశామని చెప్పుకొచ్చాడు. దానికంత ప్రాధాన్యం దక్కలేదు అది వేరే విషయం.
మనోజ్ అన్న మాటలు నాకు సెగడ్డ వచ్చింది గొకండని మీడియాని ఉద్దేశించి చెప్పడం చూస్తే తెరవెనుక వ్యవహారం ఏదో ఉంది కాబట్టే ఇలా స్లిప్ అవుతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగా ప్రాంక్ అయితే దాన్ని ఒప్పేసుకుంటే ఎవరికీ ఏ ఇబ్బంది లేదు. అదే విషయాన్ని మీడియా అతని ఫ్యాన్స్ కి చేరవేస్తుంది. కానీ అలా కాకుండా నవ్వుతూనే సెగ్గడ్డ ప్రస్తావన తేవడం మాత్రం టూ మచ్ అని అక్కడ ప్రత్యక్షంగా ఉన్న వారు అంటున్నారు. ఏది ఏమైనా ప్రతిదీ వైరల్ అవుతున్న ట్రెండ్ లో అలోచించి మాట్లాడకపోతే ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతాయి.
This post was last modified on April 6, 2023 4:18 pm
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…