యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ ‘మీటర్’ ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాతో మాస్ ప్రేక్షకులకు దగ్గరవ్వాలని భావిస్తున్నాడు కిరణ్. ఎస్ ఆర్ కళ్యాణ మండపంతో యూత్ లో వచ్చిన కొంత క్రేజ్ తో ఇప్పుడు మాస్ స్టెప్ వేశాడు. టీజర్ , ట్రైలర్ తో ఇప్పటికే సినిమా కమర్షియల్ మీటర్ లో ఉండే మాస్ సినిమా అని చెప్తున్నారు. అయితే కేవలం ఏడు సినిమాల ఎక్స్ పీరియన్స్ తో ఈ యంగ్ హీరో ఉన్నపళంగా మాస్ కమర్షియల్ సినిమా చేయడం ఆడియన్స్ కి మింగుడు పడటం లేదు.
పైగా కిరణ్ కొన్ని సందర్భాల్లో చేసే అతి కూడా అతనిపై ట్రోల్ చేసేలా చేస్తుంది. తాజాగా మీటర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఈ కుర్ర హీరో తన ఇమేజ్ చూపించేందుకు కొందరు ఫ్యాన్స్ ను రప్పించాడు. తన క్రేజ్ ఇదీ అని అక్కడ వచ్చిన వారికి , ఈవెంట్ ను లైవ్ లో చూసే వారికి చూపించే ప్రయత్నం చేశాడు.
ఇక ఈ సినిమా కోసం కిరణ్ కొంత ప్రమోషన్స్ చేసుకుంటున్నా ఈ మాస్ సినిమాకి రావలసిన బజ్ రావడం లేదు. దీంతో యంగ్ హీరో కిందా మీద అవుతున్నాడు. ఎలాగైనా మినిమం ఓపెనింగ్స్ తెచ్చుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం బుకింగ్స్ స్లోగా ఉన్నాయి. రిలీజ్ రోజు వచ్చే టాక్ పైనే సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంది. మరి మీటర్ కిరణ్ కి మాస్ ఇమేజ్ తెస్తుందా ? లెట్స్ సీ.
This post was last modified on April 5, 2023 10:35 pm
అఖండ 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో తమన్ మాటలు చర్చకు దారి తీస్తున్నాయి. ఇండస్ట్రీలో యూనిటీ లేదని,…
ఎవరో జ్వాలలు రగిలించారు, వేరెవరో దానికి బలి అయ్యారు అంటూ ఒక పాత పాట ఉంటుంది. ఎన్ని తరాలు మారినా…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలి దశ ఫలితాలలో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటిన సంగతి తెలిసిందే. రేవంత్ సర్కార్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్కు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇలాంటి…
రిలీజ్ ముందు బజ్ లేకుండా, విడుదలైన రోజు కొందరు క్రిటిక్స్ దారుణంగా విమర్శించిన దురంధర్ సృష్టిస్తున్న సంచలనాలు అన్ని ఇన్ని…
ఇకపై తాను ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటానని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు…