హృతిక్ రోషన్ , ఎన్టీఆర్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారని , అసలు ఈ కాంబోలో ఓ బాలీవుడ్ సినిమా ఉండనుందని కానీ ఎవరూ ఊహించలేదు. అయితే తాజాగా ఈ ఇద్దరి కాంబోలో వార్ 2 ఎనౌన్స్ చేసి మేకర్స్ అందరినీ షాక్ ఇచ్చారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను సర్ ప్రయిజ్ చేశారు. నిజానికి ఈ మధ్య కాలంలో హృతిక్ గురించి మాట్లాడుకుంటే అందులో వార్ టాపిక్ ముందుంటుంది. బాలీవుడ్ లో వార్ సినిమా కలెక్షన్స్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసి బిగ్గెస్ట్ స్టైలిష్ యాక్షన్ గా మెప్పించింది.
ఆ సినిమాకు సీక్వెల్ అంటే అదీ ఎన్టీఆర్ కూడా ఉంటారంటే మూవీ లవర్స్ కి ఇంకేం కావాలి ? చెప్పండి. అయితే ఈ గోల్డెన్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ కంటే ముందు యంగ్ హీరో విజయ్ దేవరకొండ చేతికి వచ్చిందట. లైగర్ షూటింగ్ టైమ్ లో హృతిక్ , విజయ్ కాంబోలో ఈ సీక్వెల్ సెట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసి విజయ్ ను అప్రోచ్ అయ్యారట.
కానీ పాన్ ఇండియా లెవెల్ లో లైగర్ డిజాస్టర్ అవ్వడంతో ఆ తర్వాత తెలుగు నుండి మరో స్టార్ కోసం చూస్తూ ఫైనల్ గా ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ తో అక్కడ భారీ క్రేజ్ అందుకున్న ఎన్టీఆర్ ను లైన్లో పెట్టేసి తారక్ నుండి గ్రీన్ సిగ్నల్ అందుకున్నారని తెలుస్తుంది. అలా విజయ్ కి వచ్చిన గోల్డెన్ ఛాన్స్ ఇప్పుడు తారక చేతిలో పడింది.
This post was last modified on April 5, 2023 10:32 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…