సెలబ్రెటీలు ఎవరైనా పెళ్లి చేసుకోగానే వాళ్లు పిల్లల్ని ఎప్పుడు కాంటారా అని చూస్తారు జనాలు. అందులోనూ ఈ సోషల్ మీడియా కాలంలో ఈ కుతూహలం బాగా ఎక్కువగా ఉంటుంది. పదేళ్ల కిందట పెళ్లి చేసుకున్న రామ్ చరణ్, ఉపాసన మాత్రం.. తల్లిదండ్రులుగా మారడానికి సుదీర్ఘ సమయమే తీసుకున్నారు.
పిల్లలు ఆలస్యం కావడం వల్ల సోషల్ మీడియాలో అనేక కామెంట్లు, కౌంటర్లు కూడా ఎదుర్కొన్నారు. కానీ ముందు అనుకున్న ప్రకారమే ఆలస్యంగా పిల్లల్ని కనాలని నిర్ణయించుకుని.. పెళ్లయిన పదేళ్లకు ఇప్పుడు తల్లిదండ్రుల కాబోతున్నారు. ఉపాసన గర్భం ధరించిన విషయాన్ని గత డిసెంబరులోనే మెగా ఫ్యామిలీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమెకు నెలలు నిండుతున్నాయి.
ఈ సందర్భంగా బేబీ షవర్ కార్యక్రమం ఏర్పాటు చేసింది ఉపాసన కుటుంబం. మామూలుగా సీమంతం పేరుతో కొంచెం ట్రెడిషనల్‌గా ఈ కార్యక్రమాన్ని చేస్తారు. కానీ ఉపాసన కుటుంబం మాత్రం ఉపాసన బేబీ షవర్‌ను చాలా మోడర్న్‌గా బీచ్ ఒడ్డున చేయడం వివేషం. ఆ ప్లేస్ ఎక్కడ అన్నది వెల్లడించలేదు కానీ.. కుటుంబ సభ్యుల మధ్య బేబీ షవర్ కార్యక్రమాన్ని ఒక బీచ్ దగ్గర జరుపుకున్న ఫొటోలతో కూడిన వీడియోను ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కుటుంబ సభ్యులు, బంధువుల నడుమ చాలా గ్రాండ్‌గానే చేశారు ఈ కార్యక్రమం.
ఉపాసన బామ్మ ఈ వేడుకలో హైలైట్ అయ్యారు. ఈ వేడుక ఏర్పాటు చేసిన తన సోదరీమణులు అనుష్పాల, సింధూరి రెడ్డిలకు ఉపాసన కృతజ్ఞతలు చెప్పింది. ఉపాసన ఇంకో రెండు మూడు నెలల్లో బిడ్డను ప్రసవిస్తుందని భావిస్తున్నారు. తాము ఆలస్యంగా పిల్లల్ని కనడం గురించి సొసైటీతో పాటు కుటుంబ సభ్యుల నుంచి కూడా కొంత వ్యతిరేకత ఎదుర్కొన్నామని, కానీ చివరికి తాను కోరుకున్న సమయంలోనే బిడ్డను కంటున్నానని ఉపాసన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
This post was last modified on April 5, 2023 6:20 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…