జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఈ రోజు ఉదయం బాలీవుడ్ నుంచి వచ్చిన అప్‌డేట్ చూసి తెగ ఖుషీ అయిపోతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’తో పాన్ ఇండియా సూపర్ స్టార్లలో ఒకడిగా అవతరించిన తారక్.. ప్రభాస్ ‘ఆదిపురుష్’ చేసినట్లే పూర్తి స్థాయి బాలీవుడ్ మూవీకి రెడీ అయిపోయాడు. అతను చేస్తున్న తొలి హిందీ చిత్రం యశ్ రాజ్ ఫిలిమ్స్ బేనర్లో కావడం.. వాళ్లు తీసే స్పై యూనివర్శ్ సినిమాల్లోకి తారక్ కూడా ఎంట్రీ ఇస్తుండటం.. బ్లాక్ బస్టర్ మూవీ ‘వార్’ సీక్వెల్లో నటిస్తుండటంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు.
హృతిక్ లాంటి హీరోను ఢీకొట్టే పాత్రలో మల్టీస్టారర్ చేస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ఇంత వరకు ఎగ్జైట్మెంట్ బాగానే ఉంది. కానీ హృతిక్ నటించే బాలీవుడ్ మూవీలో తారక్‌కు ప్రాధాన్యం ఏమాత్రం ఉంటుంది.. అతడికి దీటుగా తారక్ పాత్ర ఉంటుందా లేదా అనే చర్చ మొదలైపోయింది అప్పుడే. ఈ చర్చ మొదలవడానికి కారణాలు లేకపోలేదు.
‘ఆర్ఆర్ఆర్’లో చరణ్, తారక్‌లకు సమవుజ్జీల్లాంటి పాత్రలనే రాజమౌళి తీర్చిదిద్దినప్పటికీ.. చరణ్ పాత్ర కొంచెం ఎక్కువ హైలైట్ అయిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంలో తారక్ ఫ్యాన్స్ కొంత బాధపడ్డారు కూడా. పాత్రల ప్రాధాన్యం, ఎలివేషన్ల విషయంలో ‘ఆర్ఆర్ఆర్’ మేకింగ్ దశ నుంచే విపరీతమైన చర్చ జరగింది. ఈ నేపథ్యంలో ఇంకోసారి అలా ఎక్కువ, తక్కువ అనే చర్చ ఉండొద్దని తారక్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఐతే ‘వార్’ సినిమాలో హైలైట్ అయింది హృతిక్ క్యారెక్టరే. అతడిది హీరో పాత్రలా ఉండి.. టైగర్ ష్రాఫ్‌ది సహాయ పాత్రలా అనిపిస్తుంది.
‘వార్-2’లోనూ హృతిక్ పాత్రను అలాగే కొనసాగించి.. కొత్తగా తారక్ పాత్రను జోడిస్తారు. అలాంటపుడు ఫస్ట్ పార్ట్‌లో మాదిరే హృతిక్ ఎక్కువ హైలైట్ అయి.. తారక్ క్యారెక్టర్ దాని ముందు తగ్గితే పాత కథే పునరావృతం అవుతుంది. కాకపోతే ఇక్కడ తారక్‌కు చరణ్ సమాన స్థాయి హీరో, పైగా ఇరు వర్గాల అభిమానుల మధ్య వైరం ఉంది కాబట్టి ఇక్కడ అవసరానికి మించి చర్చ జరిగింది. బాలీవుడ్ సినిమానూ ఇదే కోణంలో చూస్తారని చెప్పలేం. పాత్రలు కొంచెం అటు ఇటుగా ఉన్నా.. తారక్‌కు ఉండాల్సిన ప్రయారిటీ తారక్‌కు ఉండాలన్నది అభిమానుల ఆకాంక్ష.
This post was last modified on April 5, 2023 2:09 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…