ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో మొదటి ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచిన పుష్ప పార్ట్ 1 ది రైజ్ కొనసాగింపు కోసం తెలుగు రాష్ట్రాల అభిమానులే కాదు అటు హిందీలోనూ దీని మీద విపరీతమైన బజ్ నెలకొంది. అందుకే స్క్రిప్ట్ విషయంలో తగ్గేదెలే అంటూ దర్శకుడు సుకుమార్ ఏకంగా ఏడాదికి పైగానే టైం తీసుకున్నారు. ఈ నెల 8న బన్నీ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 టీజర్ ని ఒక రోజు ముందుగా రిలీజ్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన చిన్న బైట్ ఒకటి ఫ్యాన్స్ కోసం వదిలారు. అందులో కొన్ని కీలకమైన క్లూస్ ఇచ్చేసి సస్పెన్స్ లో పెట్టారు.
వీడియోలో చూపించిన దాని ప్రకారం పుష్ప అరెస్ట్ అవుతాడు. తిరుపతి జైల్లో పెడతారు. అయితే తప్పించుకుంటాడు. గాయాలు ఉన్నా సరే పోలీసుల కళ్ళు గప్పి మాయమవుతాడు. దీంతో ప్రభుత్వ వ్యవస్థలన్నీ అతన్ని వేటాడ్డం మొదలుపెడతాయి. ఇంతకీ పుష్ప రాజ్ కు సంకెళ్లు వేసింది ఫహద్ ఫాసిలా లేక ఇంకేదైనా సర్ప్రైజ్ ఉందానేది వెయిట్ చేసి చూడాలి. ప్రజలు నిరసనలు వ్యక్తం చేసే షాట్స్ కూడా ఇందాక రివీల్ చేశారు. మొత్తానికి సెటప్ ఏదో గ్రాండ్ గా సెట్ చేశారు. దీన్ని ప్రత్యేకంగా బన్నీ బర్త్ డే గిఫ్ట్ గా కోట్ల రూపాయల బడ్జెట్ తో షూట్ చేసినట్టు టాక్ ఉంది.
విడుదల తేదీని ఖరారు చేసింది లేనిది ఏడున తేలనుంది. 2024 సంక్రాంతికి దాదాపు ఛాన్స్ లేనట్టే. అయినా కూడా ఒక ఆప్షన్ గా టార్గెట్ పెట్టుకుని ట్రై చేస్తారని టాక్ ఉంది. సాధ్యం కాకపోతే వేసవిని లక్ష్యంగా పెట్టుకుని బరిలో దిగుతారు. బిజినెస్ పరంగా ఇప్పటికే విపరీతమైన క్రేజ్ నెలకొన్న పుష్ప 2 టీజర్ వచ్చాక రెట్టింపు ధరలు వస్తాయని మైత్రి మూవీ మేకర్స్ అంచనా వేస్తున్నారు. డిజిటల్ హక్కులు ఇప్పటికే 200 కోట్ల ఆఫర్ ఉందనే ప్రచారం జరుగుతోంది కానీ అదెంతవరకు నిజమో ఖరారుగా చెప్పలేం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మీద భారీ అంచనాలున్నాయి
This post was last modified on April 5, 2023 8:10 pm
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…