లాక్ డౌన్ నేపథ్యంలో సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటోంది సినీ పరిశ్రమ. మామూలు పరిస్థితుల్లో అయితే గత నెల రోజుల్లో అరడజను సినిమాలైనా రిలీజై ఉండేవి. సమ్మర్ సీజన్ కాబట్టి ఆ సినిమాలన్నీ కొంచెం రేంజ్ ఉన్నవే అయ్యుండేవి. వేసవి సందడి పీక్స్‌లో ఉండే మే నెలలో ఐతే సినిమాల జాతర ఇంకా ఎక్కువగా ఉండేది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’కు కూడా మేలోనే వచ్చుండేది.
కరోనా ప్రభావంతో అటు ఇటుగా ఆరు నెలల పాటు సినిమాల ప్రదర్శనకు అవకాశమే లేదని ఇండస్ట్రీ జనాలే అంటున్నారు. ఇందుకు మానసికంగా సిద్ధమైపోయి ఉన్నారు. థియేటర్లు తెరుచుకున్నాక కూడా మునుపట్లా జనాలు దండిగా థియేటర్లకు వస్తారా.. కొత్త సినిమా రిలీజైతే థియేటర్లను నింపేస్తారా అన్నది సందేహమే. పెద్ద సినిమాలు ఎలాగోలా తట్టుకుంటాయి కానీ.. చిన్న, మీడియం రేంజ్ సినిమాల భవితవ్యమే అర్థం కాకుండా ఉంది.
నెలలకు నెలలు వడ్డీల భారం మోసి చివరికి థియేట్రికల్ రిలీజ్‌లో ఆశించిన రెవెన్యూ రాకుంటే నిర్మాతల పని దయనీయం. ఈ నేపథ్యంలో అన్ని నెలలు ఆగడం కన్నా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ ఇండస్ట్రీలో నడుస్తోంది.
పూర్తి పెట్టుబడి రాకపోయినా ఉన్నంతలో మంచి రేటొస్తే అమ్మేస్తే ఎలా ఉంటుందని నిర్మాతలు ఆలోచిస్తుండగా.. హీరోలు మాత్రం ఇందుకు పూర్తి విముఖంగా ఉన్నారని వార్తలొస్తున్నాయి. ఓటీటీల్లో రిలీజ్ చేస్తే తాము ప్రచారం కూడా చేయమని వాళ్లు మొండికేస్తున్నట్లు కూడా గుసగుసలు వినిపించాయి.
ఐతే ఈ విషయంలో హీరోల్ని నిందించడానికేమీ లేదని అంటున్నాడు అగ్ర నిర్మాత దిల్ రాజు. ‘‘ఓటీటీల్లో సినిమాల విడుదలపై హీరోల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయన్నది అవాస్తవం. ఆర్నెల్ల కంటే ఎక్కువ రోజులు ఆగితే సినిమాలు పాతబడే ప్రమాదం కూడా ఉంది. ఆర్నెల్లకి కూడా థియేటర్లు ఆరంభం కాకపోతే అప్పుడేం చేస్తాం? అందుకే హీరోలు కూడా వాళ్ల సినిమాలు ప్రేక్షకులకు చేరువ కావడమే ముఖ్యం అనుకుంటారు. అది ఎక్కడన్నది ప్రధానం కాదు.
ఐతే ఎప్పుడైనా సరే థియేటర్లో సినిమా చూసే అనుభూతి వేరు. మా ‘వి’ సినిమా విషయంలో అదే ఆలోచించాం. ఆ సౌండ్, విజువల్స్ థియేటర్లో గొప్ప అనుభూతినిస్తాయి. థియేటర్లు తెరిచి మామూలు పరిస్థితులు నెలకొంటే ప్రేక్షకులు ఎగబడి వస్తారు’’ అని రాజు అన్నాడు.
This post was last modified on April 23, 2020 1:34 pm
బిజీ హీరోయిన్ల డేట్లను షెడ్యూల్స్ తగట్టు తెచ్చుకోవడం దర్శక నిర్మాతలకు ఒక్కోసారి పెద్ద సవాల్ గా మారుతుంది. అంత డిమాండ్…
2007 లో విడుదలైన హ్యాపీ డేస్ మూవీతో కుర్ర కారులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్న. అగ్ర…
దేశవ్యాప్తంగా హిందీ భాషను రుద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తమిళనాట…
ఇళయరాజా పేరు ఈ మధ్య కాలంలో తరచుగా వివాదాలతోనే వార్తల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. వయసు మీద పడడంతో ఆయన…
ఆస్కార్ అవార్డుల్లో ఆధిపత్యం చలాయించే అన్ని సినిమాలకూ వసూళ్లు వస్తాయని గ్యారెంటీ లేదు. అలాగే వసూళ్ల మోత మోగించిన చిత్రాలకూ…
వైసీపీ హయాంలో రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ అమ్మకం, వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయాయని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో ఏ…