Movie News

20 ఏళ్ళ ప్రస్థానంలో దిల్ రాజు మైలురాళ్లు

కాలంతో సంబంధం లేకుండా సినిమా నిర్మాణం ఎప్పుడూ రిస్క్ తో కూడుకున్నదే. కోట్ల రూపాయల పెట్టుబడికి ఎలాంటి గ్యారెంటీ ఉండదు. హిట్టయ్యిందా కనకవర్షం కురుస్తుంది. ఏదైనా తేడా కొట్టిందా పాతాళానికి దారి చూపిస్తుంది. అందులోనూ గత రెండు మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో వచ్చిన విపరీతమైన మార్పులు ప్రొడక్షన్ ని చాలా రిస్కీగా మార్చేశాయి. అందుకే విజయా లాంటి పెద్ద సంస్థలు ఎప్పుడో సెలవు తీసుకోగా వందకు పైగా చిత్రాలు తీసిన సురేష్ ప్రొడక్షన్స్ లాంటి బడా బ్యానర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఇలాంటి ఒడిదుడుకులు ఎన్ని ఉన్నా వాటిని తట్టుకుని నిలబడి డిస్ట్రిబ్యూటర్ గా నిర్మాతగా విజయం సాధించడం ఆషామాషీ కాదు  

సరిగ్గా ఇరవై ఏళ్ళ క్రితం 2003లో వి వెంకటరమణారెడ్డి అనే వ్యక్తి అప్పటికే పంపిణిరంగంలో ఉన్న అనుభవం డబ్బుతో స్వంతంగా సినిమా  తీయాలని దిల్ మొదలుపెట్టారు. యూత్ లో క్రేజ్ ఉన్న నితిన్ హీరోగా మాస్ దర్శకుడిగా పేరున్న వివి వినాయక్ కాంబినేషన్ ని ప్రకటించడం చూసి ఇండస్ట్రీలో సన్నాయి నొక్కులు వినిపించాయి. కట్ చేస్తే దాని విజయం ఆ టైటిల్ నే ఇంటి పేరుగా మార్చింది. గంగోత్రిలో లుక్స్ విషయంలో విమర్శలు ఎదురుకున్న అల్లు అర్జున్ ని పూర్తిగా మేకోవర్ చేయించి సుకుమార్ అనే కుర్రాడు చెప్పిన కథని నమ్మి ఆర్య తీస్తే ఇప్పటికీ దాని వైబ్రేషన్స్ ఫ్యాన్స్ లో వినిపిస్తూనే ఉంటాయి. బోయపాటిని పరిచయం చేసిన భద్రదీ ఇదీ ఫలితం

ప్రేమకథలో ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ జోడించవచ్చని నిరూపించిన బొమ్మరిల్లు ఇప్పటికీ ఒక పాఠం లాంటిది. ప్యాన్ ఇండియా స్థాయికి చేరుకున్న వంశీ పైడిపల్లిని మున్నాతో తీసుకొచ్చింది రాజుగారే. బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్ లలో ప్రభాస్ తారక్ లాంటి స్టార్ హీరోలున్నా వాటిలో ఉన్నది పక్కా కుటుంబ అంశాలే. మరుగునపడిన మల్టీస్టారర్ సంస్కృతిని సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో ఊపిరిపోసింది  ఎస్విసి సంస్థనే. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో మెగా హీరో వరుణ్ తేజ్ తో ఫిదా రూపంలో బ్లాక్ బస్టర్ అందుకోవడం మాములు విషయం కాదు. జోష్, రామయ్య వస్తావయ్యా, కృష్ణాష్టమి లాంటి ఎదురుదెబ్బలన్నీ పాఠంగా తీసుకున్న అనుభవమది.

గేమ్ చేంజర్ లాంటి వందల కోట్ల ప్యాన్ ఇండియా మూవీతో సవాల్ స్వీకరించినా కేవలం కోటిన్నర బిజినెస్ చేసిన బలగంతో తెలంగాణ వ్యాప్తంగా నీరాజనాలు అందుకున్నా అది దిల్ రాజుకే సాధ్యమయ్యింది. ఇదంతా పొగడ్తల పర్వం కాదు. బాలీవుడ్ లో యష్ రాజ్ ఫిలింస్ లాంటి అతి కొద్ది బ్యానర్లే ఏళ్లతరబడి మనుగడ సాధ్యమవుతున్న వాతావరణంలో ఒక రీజనల్ ప్రొడ్యూసర్ మరోవైపు డిస్ట్రిబ్యూటర్ గా డ్యూయల్ రోల్ చేస్తూ సమర్ధవంతంగా భూమిక నిర్వహించడం చిన్న విషయం కాదు. అందరూ చూసేలా సినిమాలు తీయాలనే లక్ష్యమే ఆయన కంటెంట్ మీద ఏనాడూ ఫిర్యాదు రాకుండా చేసింది. దిల్ రిలీజై రెండు దశాబ్దాలు పూర్తి చేసుకోవచ్చు. కానీ దిల్ రాజు మాత్రం ఇప్పుడే కొత్తగా నవ యువకుడిగా ఉరకలేసిన ఉత్సాహంతో కనిపిస్తారు. 

This post was last modified on April 5, 2023 11:16 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

2 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

3 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

3 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

4 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

5 hours ago