Movie News

దిల్ రాజు … ఇరవై ఏళ్ళ బాకీ !

డిస్ట్రిబ్యూటర్ గా ఎన్నో అపజయాలు , విజయాలు అందుకున్న వెంకట రమణ రెడ్డి, వినాయక్ డైరెక్ట్ చేసిన ‘దిల్’ సినిమాతో నిర్మాతగా మారి అక్కడి నుండి దిల్ రాజుగా ప్రయాణం మొదలు పెట్టాడు. ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన ‘దిల్’ సినిమా రాజు గారి ఇంటి పేరుగా మారిపోయింది. అక్కడి నుండి ఇంతింతై వటుడింతతై అన్నట్టుగా అగ్ర నిర్మాతగా ఎదిగాడు దిల్ రాజు. అయితే దిల్ నుండి ఇప్పటి వరకూ ఎన్నో సుపర్ హిట్ , బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించిన దిల్ రాజు తన మొదటి హీరోకి మాత్రం ఆ తర్వాత ఒక్క సుపర్ హిట్ ఇవ్వలేకపోయాడు. దిల్ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని నితిన్ తో ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా చేశాడు దిల్ రాజు. ఆ సినిమా రిజల్ట్ ఏమైందో అందరికీ తెలిసిందే. ఇక మధ్యలో హరీష్ శంకర్ డైరెక్షన్ లో ‘దాగుడు మూతలు’ అనే సినిమా చేద్దామని ప్లాన్ చేసినా అదీ సెట్ పైకి వెళ్లలేదు.

దిల్ రాజు నిర్మాతగా మారి ఇరవై ఏళ్లవుతుంది. ఈ సందర్భంగా తన ఇరవై ఏళ్ల కెరీర్ ను సెలెబ్రేట్ చేసుకునే ఆలోచనలో ఉన్నారు. కానీ ఇరవై ఏళ్ల నుండి నితిన్ కి ఓ బాకీ ఉండిపోయాననే బాధ కాస్త ఆయనలో ఉంది. ఇక అదే దిల్ తో తనను నిర్మాతగా మార్చిన వీ వీ వినాయక్ ను యాక్టర్ మార్చి సీనయ్య సినిమా చేద్దామని ప్లాన్ చేసిన దిల్ రాజు కి ఆ ప్రాజెక్ట్ కూడా సెట్ పైకి వెళ్ళకముందే క్యాన్సిల్ అయింది.

ఇలా తన మొదటి సినిమా హీరోకి , అలాగే మొదటి దర్శకుడికి ఇరవై ఏళ్ల నుండి బాకీ పడిపోయారు దిల్ రాజు. త్వరలోనే నితిన్ తో ఓ సినిమా నిర్మించే ప్లాన్ లో ఉన్నారు. ఆ సినిమాతో నిర్మాతగా నితిన్ బాకీ తీర్చేస్తారేమో చూడాలి. ఇక వీవీ వినాయక్ బాకీ కూడా తొందర్లోనే తీరే అవకాశం కనిపిస్తుంది. కథ సెట్ అయితే మళ్ళీ ఈ కాంబోలో సినిమా రావొచ్చు. కానీ వీవీ వినాయక్ దర్శకుడిగా కాకుండా యాక్టర్ గా కనిపిస్తారు.

This post was last modified on April 5, 2023 11:26 am

Share

Recent Posts

కోన వెంకట్ భాషలో ‘క్రిమినల్స్’ ఎవరు

నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…

1 hour ago

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…

3 hours ago

విజయ్ చెప్పింది ప్రాక్టికల్‌గా సాధ్యమేనా

రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…

3 hours ago

జంతర్ మంతర్… కేసీఆర్ ముందే పసిగట్టారా?

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…

5 hours ago

డ్రాగన్ ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలి

ఒక ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ ఆలస్యమైనప్పుడు, వాయిదాలు పడినప్పుడు దాని గురించి రకరకాల ప్రచారాలు జరగడం మాములే. బాహుబలి…

6 hours ago

విమానంలోనే కాక్రోచ్ నాయకుడి అరెస్టు

భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న…

7 hours ago