హీరో శర్వానంద్ ప్రస్తుతం శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో ఓ స్టైలిష్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత శర్వా లైనప్ పెద్దగానే ఉంది. అందులో ముఖ్యంగా గుహన్ పేరు ఎక్కువగా వినబడుతుంది. సినిమాటోగ్రాఫర్ గుహన్ కళ్యాణ్ రామ్ ‘118’ సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ సినిమాను తక్కువ బడ్జెట్ తో థ్రిల్లర్ గా రూపొందించి దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. శివానీ రాజశేఖర్ తో WWW అనే ఓటీటీ సినిమా చేశాడు. ఆ తర్వాత ఆనంద్ దేవరకొండతో గుహన్ ‘హై వే’ అనే సినిమా చేశాడు అది కూడా ఓటీటీలో రిలీజైంది.
ఇక 118 తర్వాత ఓ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ కథ రాసుకున్న గుహన్ ఆ కథను ఇప్పుడు శర్వాకి చెప్పి ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాడని తెలుస్తుంది. ఈ కాంబో సినిమాను దిల్ రాజు నిర్మించే అవకాశం ఉంది. ఎప్పటి నుండో గుహన్ దిల్ రాజు బేనర్ లో ఓ సినిమా చేయాలని చూస్తున్నాడు. బహుశా అన్నీ కుదిరితే శర్వా , గుహన్ సినిమా దిల్ రాజు బేనర్ లోనే ఉంటుంది.
శర్వా హీరోగా డిఫరెంట్ మూవీస్ చేయాలని భావిస్తున్నాడు. ఒకే ఒక జీవితం తర్వాత కొత్త కథలు , చేయని జానర్స్ టచ్ చేయాలని చూస్తున్నాడు. అందులో భాగంగానే గుహన్ తో ఓ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు కావచ్చు. త్వరలోనే ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది. మరి కళ్యాణ్ రామ్ కి థ్రిల్లర్ జోనర్ లో హిట్ ఇచ్చిన ఈ సినిమాటోగ్రాఫర్ కం డైరెక్టర్ ఇప్పుడు శర్వానంద్ కి ఎలాంటి హిట్ ఇస్తాడో ?
This post was last modified on April 5, 2023 6:30 am
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…