Movie News

రాజ‌కీయాల్లోకి వ‌స్తారా.. అంటే, దిల్ రాజు ఆన్స‌ర్ ఇదే!

దిల్ రాజు. ప్ర‌ముఖ టాలీవుడ్ నిర్మాత‌. చిన్న సినిమాల‌తో సూప‌ర్ డూప‌ర్ హిట్లు కొట్టి.. త‌న‌కంటూ.. ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నా రు. ప్ర‌స్తుతం ఏపీ నిర్మాత‌ల మండ‌లి పొజిష‌న్‌లో ఉన్నారు. ఇటీవ‌లే క‌మెడియ‌న్ వేణుతో తీసిన ‘బ‌ల‌గం’ మూవీ కూడా అంచ నాలు దాటి సూప‌ర్ హిట్ అయ్యింది. ఇక‌, ఏపీ ప్ర‌భుత్వంతోనూ.. దిల్ రాజుకు స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయ‌నే చ‌ర్చ కూడా ఉంది. ఏపీలో ఏడాదిన్న‌ర కింద‌ట సినిమా టికెట్లు విష‌యం వివాదానికి దారితీసిన‌ప్పుడు.. తొలిసారు.. ఆయ‌న రాజు కాదు.. రెడ్డి అని తెలిసింది.

ఇక‌, ఏపీ ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌ల‌కు కూడా చొర‌వ చూపించి.. సినిమా టికెట్ల వివాదాన్ని త‌న‌దైన శైలిలో ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య త్నించారు. అదేవిధంగా తెలుగు సినిమాల్లో నావెల్టీని పెంచుతున్న నిర్మాత‌గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు తాజా విష‌యాని కి వ‌స్తే.. అటు తెలంగాణ‌లోను, ఇటుఏపీలోనూ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అయింది. ఈ ఏడాది చివ‌రిలో తెలంగాణ‌లోను, వ‌చ్చే ఏడాది ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో సినీ రంగంలో ఉన్న‌వారికి.. రాజ‌కీయాల్లోకి రావాలంటూ.. పిలుపులు అందుతున్నాయి.

ఇప్ప‌టికే చాలా మంది క‌మెడియ‌న్లు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు కూడా.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఇలానే దిల్ రాజుకుకూడా. ఆఫ‌ర్లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని వైసీపీ పార్టీ నుంచి ఆయ‌న‌కు ఆహ్వానం అందుతోంద‌ని..కొన్నాళ్లుగా ప్ర‌చారం ఉంది. అదేస‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన వైపు ఆయ‌నే చూస్తున్నార‌ని మ‌రికొంద‌రు ప్ర‌చారం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో త‌న రాజ‌కీయ రంగం ప్ర‌వేశంపై వ‌స్తున్న వార్త‌ల విష‌యంలో దిల్ రాజు తాజాగా స్పందించారు.

“రాజకీయాల్లోకి రమ్మని అడుగుతున్న మాట వాస్తవమే… కానీ, నేను ఇక్కడ(టాలీవుడ్‌) వేసే రాళ్లే తట్టుకోలేకపోతున్నా… అక్కడ(రాజ‌కీయం) రాళ్ళు అసలు తట్టుకోలేను అనే అనుకుంటున్నా” అని దిల్ రాజు ముక్తాయించారు. కేవలం ఒకే ఒక్క కామెంట్‌తో త‌న రాజ‌కీయాల‌పై వ‌స్తున్న‌రూమ‌ర్ల‌కు ఆయ‌న ఫుల్ స్టాప్ పెట్టారు.

This post was last modified on April 4, 2023 8:39 pm

Share

Recent Posts

సెటైర్లు సీరియస్‌గా తీసుకోనవసరం లేదు

నిన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ ఓపెనింగ్స్ డీసెంట్ గా మొదలయ్యాయి. ఉదయం కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ సాయంత్రానికి పరిస్థితిలో మార్పొచ్చింది.…

1 hour ago

డబ్బింగ్ సినిమాల రేట్ల పెంపు సబబేనా

అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 మొదటి రోజు చెన్నై టికెట్ ధర కంటే ఆంధ్రప్రదేశ్ లోని ఒక…

1 hour ago

మార్చాల్సింది జ్ఞానేష్‌నా.. వ్య‌వ‌స్థ‌నా?!

ఒక ఇంట్లో దొంగ ప‌డ్డాడు. న‌గ‌లు, నట్రా దోచుకున్నాడు. య‌జ‌మాని ... ఆ దొంగ‌ను గుర్తించాడు. పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.…

3 hours ago

బుమ్రా, పాండ్యా లేకుంటే అంతేనా…

టీ20ల్లో 249 పరుగులు చేసినా గెలవలేకపోతే బౌలింగ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాకు అదే…

4 hours ago

గ్రీన్‌కార్డ్ షాక్… ఐటీ కంపెనీలు ఏమంటున్నాయి?

అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత ఐటీ కంపెనీలకు కొత్త సమస్య వచ్చిపడింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సహా ఎనిమిది…

4 hours ago

తిరుమ‌ల కేంద్రంగా సాయిరెడ్డి విన్యాసాలు స‌క్సెస్ అయ్యేనా?

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కేంద్రంగా వైసీపీ మాజీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు వి. విజ‌యసాయిరెడ్డి చేస్తున్న రాజ‌కీయాల‌పై ఆస‌క్తికర…

9 hours ago