దిల్ రాజు. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత. చిన్న సినిమాలతో సూపర్ డూపర్ హిట్లు కొట్టి.. తనకంటూ.. ప్రత్యేకతను చాటుకున్నా రు. ప్రస్తుతం ఏపీ నిర్మాతల మండలి పొజిషన్‌లో ఉన్నారు. ఇటీవలే కమెడియన్ వేణుతో తీసిన ‘బలగం’ మూవీ కూడా అంచ నాలు దాటి సూపర్ హిట్ అయ్యింది. ఇక, ఏపీ ప్రభుత్వంతోనూ.. దిల్ రాజుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే చర్చ కూడా ఉంది. ఏపీలో ఏడాదిన్నర కిందట సినిమా టికెట్లు విషయం వివాదానికి దారితీసినప్పుడు.. తొలిసారు.. ఆయన రాజు కాదు.. రెడ్డి అని తెలిసింది.
ఇక, ఏపీ ప్రభుత్వంతో చర్చలకు కూడా చొరవ చూపించి.. సినిమా టికెట్ల వివాదాన్ని తనదైన శైలిలో పరిష్కరించేందుకు ప్రయ త్నించారు. అదేవిధంగా తెలుగు సినిమాల్లో నావెల్టీని పెంచుతున్న నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు తాజా విషయాని కి వస్తే.. అటు తెలంగాణలోను, ఇటుఏపీలోనూ అసెంబ్లీ ఎన్నికలకు రంగం రెడీ అయింది. ఈ ఏడాది చివరిలో తెలంగాణలోను, వచ్చే ఏడాది ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సినీ రంగంలో ఉన్నవారికి.. రాజకీయాల్లోకి రావాలంటూ.. పిలుపులు అందుతున్నాయి.
ఇప్పటికే చాలా మంది కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా.. రాజకీయాల్లోకి వచ్చారు. ఇలానే దిల్ రాజుకుకూడా. ఆఫర్లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని వైసీపీ పార్టీ నుంచి ఆయనకు ఆహ్వానం అందుతోందని..కొన్నాళ్లుగా ప్రచారం ఉంది. అదేసమయంలో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన వైపు ఆయనే చూస్తున్నారని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన రాజకీయ రంగం ప్రవేశంపై వస్తున్న వార్తల విషయంలో దిల్ రాజు తాజాగా స్పందించారు.
“రాజకీయాల్లోకి రమ్మని అడుగుతున్న మాట వాస్తవమే… కానీ, నేను ఇక్కడ(టాలీవుడ్) వేసే రాళ్లే తట్టుకోలేకపోతున్నా… అక్కడ(రాజకీయం) రాళ్ళు అసలు తట్టుకోలేను అనే అనుకుంటున్నా” అని దిల్ రాజు ముక్తాయించారు. కేవలం ఒకే ఒక్క కామెంట్‌తో తన రాజకీయాలపై వస్తున్నరూమర్లకు ఆయన ఫుల్ స్టాప్ పెట్టారు.