హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టినప్పటికి తెలుగులో పూర్ణ కెరీర్ ఆశించిన స్థాయిలో జరగలేదు. అయితే ఇక్కడ కన్నా తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకుని వరస అవకాశాలతో దూసుకుపోతోంది. ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాక బిజీగా మారిపోయింది. వయసుకి మించిన క్యారెక్టర్లు చేస్తూ నటిగా మంచి ఛాలెంజులు స్వీకరిస్తోంది. ఆమె అసలు పేరు షమ్నా ఖాసిం. గత ఏడాది షాహిద్ అసిఫ్ అలీతో మూడు మూళ్ళ బంధం ఏర్పరుచుకున్నాక కొంత గ్యాప్ తీసుకున్న పూర్ణ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చి తల్లిగా నిజ జీవితంలో సరికొత్త పాత్రలో ప్రవేశించింది.
2004లో మంజు పోలోరు పెంకుట్టితో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూర్ణ తెలుగులో శ్రీహరి నటించిన శ్రీమహాలక్ష్మి(2007)తో తెలుగులో ప్రవేశించింది. ఇది ఆశించిన స్థాయిలో ఆడలేదు. అల్లరి నరేష్ సరసన 2011లో చేసిన సీమ టపాకాయ్ సూపర్ హిట్ కావడం పూర్ణకు తొలి బ్రేక్. రవిబాబు తీసిన హారర్ థ్రిల్లర్ అవును తనలోని అసలు యాక్టర్ ని బయటికి తీసుకొచ్చింది. అవును 2, మామ మంచు అల్లుడు కంచు, అవంతిక, రాక్షసి, సిల్లీ ఫెలోస్, సువర్ణ సుందరి ఇలా చాలా సినిమాలు చేసినా అవేవి కనీస స్థాయిలో ఆకట్టుకోలేదు.
మహేష్ బాబు శ్రీమంతుడు మొదటిపాటలో డాన్స్ చేయడం పూర్ణకు దక్కిన స్పెషల్ మెమరీ. కొడివీరన్ కోసం 2017లో నిజంగానే గుండు చేయించుకున్న పూర్ణ ఏ హీరోయిన్ తలపెట్టని సాహసం చేసింది. కానీ ఆ చిత్రం సక్సెస్ కాకపోవడం బ్యాడ్ లక్. అఖండ నుంచి మొన్న వచ్చిన దసరా దాకా చెప్పుకోదగ్గ వేషాల్లో పూర్ణ కనిపిస్తూనే ఉంది. గర్భం దాల్చిన టైంలో విరామం తీసుకోవడం తప్ప రెగ్యులర్ గా సినిమాలు చేస్తూనే ఉంది. బిడ్డతో పాటు పూర్ణ పంచుకున్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేస్తున్నాయి.
This post was last modified on April 4, 2023 8:37 pm
గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…
తన ప్రియురాలి కోసం చైన్ స్నాచింగ్స్ దొంగగా మారిన ఒక ప్రియుడు... బైకుల మీద స్పీడుగా వెళుతూ మహిళల మెడల…
సంక్రాంతి పండక్కు తెలుగు రాష్ట్రాల థియేటర్లకు ఊహించిన సమస్యే తలెత్తింది. షోలు చాలక ప్రేక్షకుల డిమాండ్ అధికం కాగా దానికి…
వైసీపీలో నిన్న మొన్నటి వరకు పార్టీ ముఖ్య నాయకుడు, మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రంగా అనేక విమర్శలు వచ్చాయి.…