Ram Charan & Upasana
పదేళ్ల కిందట పెళ్లి చేసుకున్న రామ్ చరణ్, ఉపాసన జంట.. ఎంతకీ తల్లిదండ్రులు కాకపోవడంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. దీని మీద ట్విట్టర్లో స్పేస్‌లు పెట్టి మరీ చర్చించుకున్నారు జనాలు. ఈ విషయం మీద చరణ్, ఉపాసనలను దారుణంగా ట్రోల్ చేసిన వాళ్లు కూడా ఉన్నారు. ఏదో సమస్య ఉండటం వల్ల ఈ జంటకు పిల్లలు పుట్టే అవకాశం లేదని తేల్చేసిన వాళ్లూ లేకపోలేదు.
ఐతే ఈ ఊహాగానాలన్నింటికీ తెరదించుతూ గత ఏడాది చరణ్, ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని వెల్లడించారు. దీంతో అందరి నోళ్లకు తాళాలు పడ్డాయి. ఐతే ఇంత ఆలస్యంగా బిడ్డను కనాలన్న నిర్ణయం పెళ్లి సమయంలోనే తీసుకున్నారట చరణ్, ఉపాసన. బయటి వ్యక్తులతో పాటు కుటుంబ సభ్యుల ఒత్తిడిని కూడా తట్టకుని తాము పదేళ్ల పాటు పిల్లల్ని కనకుండా ఉన్నట్లు ఉపాసన వెల్లడించడం విశేషం.
“సమాజం కోరుకున్నపుడు కాకుండా నేను తల్లిని కావాలనుకున్నపుడు గర్భం దాల్చడం పట్ల నాకెంతో ఉత్సాహంగా, గర్వంగా ఉంది. పెళ్లయిన పదేళ్ల తర్వాత మేం బిడ్డలను కనాలని అనుకున్నాం. ఎందుకంటే ఇదే సరైన సమయం. మేమిద్దరం మా రంగాల్లో ఎదిగాం. మాకు మేముగా ఆర్థికంగా బలోపేతం అయ్యాం. మా పిల్లలకు కావాల్సినవన్నీ ఇచ్చే స్థాయికి చేరాం. ఆలస్యంగా పిల్లల్ని కనడం అన్నది మా ఇద్దరి నిర్ణయం. ఈ విషయంలో అటు సమాజంతో పాటు ఇటు కుటుంబం, బంధువుల ఒత్తిడికి కూడా మేం తలొగ్గలేదు. ఇది మా మధ్య బలమైన బంధంతో పాటు పిల్లల విషయంలో మాకున్న స్పష్టతకు నిదర్శనం” అని ఉపాసన తెలిపింది. తాను పెళ్లయిన కొత్తలో సోషల్ మీడియా నుంచి ఎదుర్కొన్న బాడీ షేమింగ్ గురించి కూడా ఉపాసన ఇప్పటికే ఓపెన్ అయిన సంగతి తెలిసిందే.
This post was last modified on April 4, 2023 2:50 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…