ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ లేడీ ఓరియంటెడ్ కథలపై ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. అనుష్క ఇప్పటికే ఈ తరహా కథలతో స్టార్ హీరోయిన్స్ కి ఓ బరోసా ఇచ్చేసింది. నయనతార , కీర్తి సురేష్ లు కూడా ఇలాంటి కథలతో కొన్ని ఎక్స్ పెరిమెంట్స్ చేసేశారు. తాజాగా సమంత కూడా లేడీ ఓరియంటెడ్ కథలకే ఓటేస్తూ ముందుకు వెళ్తుంది. ఇప్పటికే ఓ బేబీ , యశోదా , శాకుంతలం అనే సినిమాలు చేసేసి సొంత మార్కెట్ తెచ్చుకుంది సామ్. ఇప్పుడు రష్మిక కూడా వీరి దారిలోనే ప్రయాణించబోతుంది.
రష్మిక ప్రదాన పాత్రలో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా రాబోతుంది. తాజాగా పూజా కార్యక్రమాలతో ఈ సినిమా మొదలైంది. రెయిన్ బో అనే టైటిల్ ఫిక్స్ చేశారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతుంది ఈ సినిమా. అయితే ఇందులో సపోర్టింగ్ పాత్ర ఒకటి ఉంది. ఆ పాత్రను తెలుగులో ఏ హీరో చేయరు కాబోలు. అందుకే మలయాళంలో హీరోగా చేసిన దేవ్ మోహన్ ను ఆ కేరెక్టర్ కి తీసుకున్నారు.
దేవ్ మోహన్ తాజాగా ‘శాకుంతలం’ లో దృశ్యంత్ మహారాజాగా నటించాడు. ఈ పాత్రను తెలుగులో ఏ హీరో చేయరని అందుకే తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని దేవ్ మోహన్ ను ఎంచుకున్నానని గుణ శేఖర్ పదే పదే చెప్తున్నారు. ఇప్పుడు రష్మిక సినిమాకి కూడా అదే ఇబ్బంది. తెలుగులో మరో హీరో ఇలాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసేందుకు ముందుకు రారనే ఉద్దేశ్యంతో దేవ్ మోహన్ కే ఓటేశారు. ఇలా వరుస ఆఫర్లతో దేవ్ మోహన్ లేడీ ఓరియంటెడ్ సినిమాలకు బెస్ట్ ఛాయిస్ అనిపించుకుంటున్నాడు. ఇకపై లేడీ ఓరియంటెడ్ సినిమాలకి దేవ్ మోహనే బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తాడేమో.
This post was last modified on April 3, 2023 9:52 pm
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…