Movie News

మల్టీస్టారర్ పాటలో సల్మాన్ వెంకీ చరణ్

రంజాన్ పండగ సందర్భంగా ఈ నెల 21న విడుదల కాబోతున్న కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమా మీద సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో షారుఖ్ ఖాన్ పఠాన్ తో వెయ్యి కోట్ల రికార్డును బద్దలు కొట్టడంతో అందులో కనీసం ముప్పాతిక అందుకోవాలని ఎదురు చూస్తున్నారు. అయితే విచిత్రంగా మూవీ మీద ఆశించిన స్థాయిలో హైప్ లేదు. ట్రేడ్ సైతం ఈ పరిణామం పట్ల ఆశ్చర్యపోతోంది. వెంకటేష్ – పూజా హెగ్డే – రోహిణి హట్టంగడి – భూమిక ఇలా తెలుగు ఫ్లేవర్ ఎక్కువ కావడం వల్లే నార్త్ ఆడియన్స్ కు ఇంకా కనెక్ట్ కాలేదని విశ్లేషణ చేస్తోంది.

అందుకే యూనిట్ ఇప్పుడు గేమ్ మార్చి కిసీకా భాయ్ కిసీకా జాన్ లో కీలకమైన మల్టీస్టారర్ సాంగ్ ని రిలీజ్ చేయబోతోంది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే సల్మాన్ వెంకీలతో పాటు రామ్ చరణ్ కూడా డాన్సు కోసం కాలు కదపడం. దానికి సంబంధించిన ప్రీ విజువల్ ఆల్రెడీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆర్ఆర్ఆర్ లో నాటు నాటుకి ఆస్కార్ వచ్చాక రాజమౌళి తారక్ చరణ్ లకు వరల్డ్ వైడ్ పాపులారిటీ బాగా పెరిగిపోయింది. దీన్నే కండల వీరుడి నిర్మాతలు తమకు అనుకూలంగా మార్చుకోబోతున్నారు. మెగాపవర్ స్టార్ క్యామియోని హైలైట్ చేయబోతున్నారు.

ఇలా చేయడం వెనుక కథ ఉంది. గాడ్ ఫాదర్ లో పావు గంట పాత్రకు కేవలం చిరంజీవి కుటుంబంతో ఉన్న అనుబంధం కారణంగా సల్మాన్ పైసా రెమ్యునరేషన్ తీసుకోకుండా చేశారు. ఫలితం గొప్పగా రాకపోయినా ఫ్యాన్స్ అరుదైన కాంబోని తెరమీద చూసుకున్నారు. దానికి బదులుగా చరణ్ ఏరికోరి మరీ కిసీకా భాయ్ కిసీకా జాన్ సెట్స్ కు వెళ్లి మరీ ఆ సినిమాలో భాగమయ్యాడు. ఇప్పుడదే ప్లస్ కాబోతోంది. పవన్ కళ్యాణ్ కాటమరాయుడు రీమేక్ గా దీని మీద ప్రచారం ఉంది కానీ అదెంత వరకు నిజమో తెలియాలంటే మాత్రం ఇంకో ఇరవై రోజులు ఆగాల్సిందే.

This post was last modified on April 3, 2023 5:56 pm

Share

Recent Posts

బాబాయ్ గొడ్డలి జపమైపోయింది

రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనగానే ప్రతి ఒక్కరికీ వైసీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి…

12 minutes ago

సుకుమార్ ఏం మార్పు కోరుకుంటున్నట్లు?

పెద్ద దర్శకులు కొందరు తమ టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్…

34 minutes ago

రేట్లు కావాలి కానీ రజినీ రాడు

సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి పెద్ద హీరోలకు ఏమాత్రం…

1 hour ago

ముగ్గుర్ని చంపేస్తే నాన్న చూసుకుంటాడా?

ఈ మధ్యకాలంలో హిట్ అండ్ రన్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇక, కొందరు డబ్బున్న బడాబాబుల పిల్లలు, కొందరు రాజకీయ నాయకుల…

1 hour ago

రామాయణం కన్నా ఆదిపురుష్ నయం ఏమో?

‘రామాయణం’ రెండు భాగాలకు కలిపి రూ.4 వేల కోట్ల బడ్జెట్ పెట్టినట్లు దాని నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించినపుడు అందరికీ…

2 hours ago

డిజాస్టర్ హీరోతో డిజాస్టర్ డైరెక్టర్?

‘కేజీఎఫ్’తో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడు యశ్. కేజీఎఫ్-2 తర్వాత అతను ఎలాంటి చిత్రం చేస్తాడా అని…

2 hours ago