సమంత గురించి శోభిత ధూళిపాళ్ళ స్పందించిందంటే కచ్చితంగా జనాల్లో ఒక ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే సమంత నుంచి నాగచైతన్య విడిపోయాక.. అతడితో శోభిత ప్రేమాయణం నడుపుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శోభిత.. సోషల్ మీడియాలో ‘సమంత’ గురించి స్పందించడం చర్చనీయాంశంగా మారింది. కానీ ఆమె మాట్లాడింది నాగచైతన్య మాజీ భార్య సమంత గురించి కాదు. తన సోదరి సమంత గురించి.
అవును.. శోభిత సోదరి పేరు సమంతేనట. తాజాగా ఆమె పెళ్లి జరిగింది. విశాఖపట్నంలో జరిగిన ఈ పెళ్లికి శోభిత హాజరైంది. అక్కడ మెహందీ, సంగీత్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన సోదరిని పెళ్లి కూతురిగా చూసి తాను ఎమోషనల్ అయినట్లు శోభిత వెల్లడించింది.
“బంధువులందరం వేడుకల్లో కలుసుకున్నాం. ఈ వేడుకల్లో అందంగా ముస్తాబవ్వాలనుకున్నా. కానీ పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉండటం వల్ల మెహందీకి సరిగా రెడీ కాలేకపోయాను. సమంతను పెళ్లి కూతురిగా చూస్తుంటే ఎమోషనల్‌గా అనిపిస్తోంది. ఆనందంతో కన్నీళ్లు వచ్చేశాయి. సంగీతం ఎంతో సందడిగా జరిగింది. బంధువులు, స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేశా. ఈ అనుభవాన్ని ఎప్పటికీ మరిచిపోలేను” అని శోభిత పేర్కొంది.
చైతూ మాజీ భార్య పేరే.. శోభిత సోదరికి ఉండటం అందరికీ ఆశ్చర్యం కలుగుతోంది. చైతూతో శోభిత ప్రేమాయణం ముందు రూమర్ అనే అంతా అనుకున్నారు. కానీ ఈ మధ్య యూకేలో వీళ్లిద్దరూ కలిసి ఒక రెస్టారెంట్లో ఉన్న ఫొటో బయటికి రావడంతో ఇది ఊహాగానం కాదని అర్థమైంది. ఏడాది కిందట్నుంచే వీళ్లిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లుగా భావిస్తున్నారు.
This post was last modified on April 3, 2023 5:52 pm
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…