తెలంగాణ వ్యాప్తంగా ఏదో సంబరంలా జరుగుతున్న బలగం ఓపెన్ ఫ్రీ షోలు పెద్ద రాద్ధాంతానికే దారి తీసేలా ఉన్నాయి. ముందు ఒకటి రెండు గ్రామాల్లో మొదలైన ఈ ట్రెండ్ మెల్లగా వందల సంఖ్యలో పల్లెటూళ్ళకు పాకిపోవడంతో ఉచితంగా చూసిన వాళ్ళ సంఖ్య లక్షలకు చేరినా ఆశ్చర్యం లేదనేలా ఉంది. సోషల్ మీడియాలో ఈ స్క్రీనింగ్స్ తాలూకు ఫోటోలు వీడియోలు వైరలవుతున్నాయి. దీంతో థియేటర్ రెవిన్యూకు గండి పడుతోందని గుర్తించిన నిర్మాత దిల్ రాజు తన నిర్మాణ సంస్థ తరఫున నిజామాబాద్ ఎస్పికి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
ఆ లేఖలో కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు అమెజాన్ ప్రైమ్ నుంచి చట్టవ్యతిరేకంగా సినిమాను డౌన్లోడ్ చేసుకుని ఉచితంగా పబ్లిక్ కి పంచి పెడుతున్నాయని వాళ్ళ మీద చర్య తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. నిజానికి ఎగ్జిబిషన్ యాక్ట్ ప్రకారం నిర్మాత అనుమతి లేకుండా వందల జనాన్ని పోగేసి అలా ఆరుబయట సినిమా వేయడం ఇల్లీగలే. అయితే జనంలో బలగం పట్ల విపరీతమైన ఆసక్తిని గమనించిన సర్పంచులు రాజకీయ నాయకులు వాళ్ళను సంతోష పెట్టడం కోసం షోలు వేయడం ఇంత రభసకు కారణమయ్యింది. ప్రైమ్ కు తెలియకుండానే ఇదంతా జరిగిపోయింది.
అసలు రిలీజై విజయవంతంగా బ్లాక్ బస్టర్ అయిన సినిమాను కేవలం ఇరవై రోజుల గ్యాప్ తో ఓటిటికి ఇచ్చినప్పుడు ఇలాంటి పరిణామాలే జరుగుతాయి. అదే ఏ నెలన్నరో రెండు నెలలో అయ్యుంటే ఈ స్థాయిలో ఫ్రీ షోలు పడేవి కాదన్నది వాస్తవం. ఒకరకంగా ఇక్కడ ప్రొడ్యూసర్ వల్లే ఈ పరిణామం తలెత్తింది. అలా అని వేసినవాళ్లది ఏ తప్పూ లేదని కాదు. అత్యుత్సాహంలో ఇలా చేయడం కరెక్టా కాదానేది ఎవరిని అడగకుండా పని కానిచ్చేశారు. తీరా చూస్తే వ్యవహారం పోలీసుల దాకా వెళ్ళింది. ఇదంతా ఎలా ఉన్నా బలగం చూశాక తెలంగాణలో కొన్ని విడిపోయిన కుటుంబాలు కలవడం కొసమెరుపు.
This post was last modified on April 3, 2023 11:20 am
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు సొంత బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు లో తాజాగా…
గత ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ జోడీ. పాన్ ఇండియా స్థాయిలో పెద్ద…
మాటల మాంత్రికుడు.. సోషల్ మీడియాలో దుమ్మురేపి.. ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా శాసన మండలిలో ఉన్న తీన్మార్ మల్లన్న తన వాయిస్ ద్వారా…
‘ఆర్ఎక్స్ 100’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ దర్శకుడు అజయ్ భూపతి, మళ్లీ తన పవర్ చూపించిన సినిమా..…
విశాఖ రైల్వే జోన్..ఉమ్మడి ఏపీ విడిపోయిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన కీలక హామీలలో ఒకటి. జగన్ హయాంలో అదిగో…
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఇప్పటికే వలసదారులపై కఠిన…