సెలబ్రెటీలైనా.. సెలబ్రెటీలను పెళ్లి చేసుకున్న వాళ్లయినా.. సోషల్ మీడియాలో ఏదో ఒక దశలో ట్రోలింగ్ ఎదుర్కొనేవారే. రామ్ చరణ్‌ను పెళ్లాడిన ఉపాసనకు కూడా ఈ బాధలు తప్పలేదు. పెళ్లయిన కొత్తలో ఉపాసన విపరీతంగా బాడీ షేమింగ్ ఎదుర్కొంది. ఆమెను పెళ్లాడిన చరణ్ సైతం ట్రోలింగ్ ఎదుర్కోక తప్పలేదు. చివరికి వీళ్లిద్దరూ చాలా ఏళ్లు పిల్లలను కనకపోవడం మీద కూడా సోషల్ మీడియా జనాలు ఊరుకోలేదు.
దాని మీద కూడా దారుణమైన మాటలు అన్నారు. కాగా త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్న ఉపాసన.. తన పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో వివిధ సందర్భాల్లో ఎదుర్కొన్న ట్రోలింగ్ గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ అయింది. చరణ్‌ను పెళ్లి చేసుకున్నాక తనపై వచ్చిన బాడీ షేమింగ్ కామెంట్లు.. అలాగే తనను పెళ్లి చేసుకున్న చరణ్ గురించి జనాలు అన్న మాటల గురించి ఆమె మాట్లాడింది.
“చిన్నప్పట్నుంచి నన్ను ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో జడ్జ్ చేస్తూనే ఉన్నారు. సొసైటీలో ప్రతి ఒక్కరికీ ఇలాంటి అనుభవాలు ఉంటాయి. పెళ్లయిన కొత్తలో నేనూ బాడీ షేమింగ్ కామెంట్లు ఎదుర్కొన్నా. నేను అందంగా లేనని, లావుగా ఉన్నానని అన్నారు. చరణ్ డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడని కూడా కామెంట్ చేశారు. ఇలాంటి విమర్శలు చేసిన వాళ్లను నేను ఏమీ అనాలనుకోవట్లేదు.
ఎందుకంటే వాళ్లకు మా గురించి ఏమీ తెలియదు. చరణ్, నేను కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలిశాం. భిన్న కుటుంబాల నుంచి వచ్చిన మేం ఒకరి నుంచి ఒకరం నేర్చుకుంటూ ఎదిగాం. పెళ్లయిన కొత్తలో నా గురించి ఏదేదో అన్న వాళ్లు ఈ పదేళ్లలో నన్ను అర్థం చేసుకున్నారు. ఇప్పుడు నా మీద వాళ్లందరి అభిప్రాయం మారిపోయింది. ట్రోల్స్ వచ్చాయని నేను కుంగిపోలేదు. వాటిని జయించాను. విమర్శలను నేను ఎలా ఎదుర్కొన్నానో నాకు మాత్రమే తెలుసు. అందుకే నేను ఒక ఛాంపియన్ లాగా ఫీలవుతుంటా” అని ఉపాసన పేర్కొంది.
This post was last modified on April 2, 2023 4:24 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…