కమర్షియల్ హీరోల సినిమాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యం దక్కడం అరుదు. కేవలం ఆడి పాడేందుకు, గ్లామర్ ఒలకబోసేందుకు తప్ప తమలో ఉన్న నటికి ఛాలెంజ్ విసిరే పాత్రలు దొరకడమే అదృష్టం అనుకోవాలి. కానీ కొందరికి మాత్రం టాలెంట్ వల్లో లక్కు వల్లో అప్పుడప్పుడు అలాంటివి వరిస్తాయి. దసరాలో కథ మొత్తం తన చుట్టే తిరిగే వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ మీద ఎన్ని కాంప్లిమెంట్స్ వస్తున్నాయో చూస్తున్నాం. ముఖ్యంగా ప్రేమ సన్నివేశాల్లో జీవించిన తీరు, పెళ్లి మండపం బయట సాంప్రదాయ తెలంగాణ బీట్ కి డాన్స్ చేసిన జోరు గొప్పగా పేలాయి.
మహానటి తర్వాత పెర్ఫార్మన్స్ కు స్కోప్ దక్కిన పాత్రల్లో ఇప్పుడు దసరాదే రెండో స్థానం. మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి, పెంగ్విన్ లాంటి ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీస్ ఎన్ని చేసినా కీర్తికి వాటి వల్ల దక్కిన ప్రయోజనం తక్కువే. అందుకే వెన్నెల చాలా స్పెషల్ గా నిలిచిపోతుంది. ఇక సమంత ఇంతే ప్రాముఖ్యం ఉన్న క్యారెక్టర్ అయిదేళ్ల క్రితం రంగస్థలంలో రామలక్ష్మిగా చేసింది. పొగరు దూకుడు కలగలిసిన పల్లెటూరి అమ్మాయిగా ఆమె తీసుకున్న డబ్బు బాకీనే సుకుమార్ కథలో కీలక మలుపుకు కారణమవుతుంది. రంగమ్మ మంగమ్మ స్టెప్పుల గురించి చెప్పనక్కర్లేదు
పోలికల పరంగా ఎవరు గ్రేట్ అనేది చూసుకుంటే నువ్వా నేనా అనే స్థాయిలో ఇద్దరూ పండించారు కాబట్టి ఈ అంశాన్ని జడ్జ్ చేయడం అంత సులభం కాదు. అయితే కీర్తి సురేష్ క్లిష్టమైన తెలంగాణ యాసని నేర్చుకుని మరీ స్వంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం ఓ మార్కు ఎక్కువే తెచ్చినా సామ్ ని తక్కువ చేసి చూడలేం. ఏది ఏమైనా పోస్టర్ తో మొదలుపెట్టి సినిమా దాకా హీరో డామినేషనే అధికంగా ఉన్న టాలీవుడ్ లో గురు శిష్యులు సుకుమార్ – శ్రీకాంత్ ఓదెలలు ఇలాంటి వెన్నెల రామలక్ష్మిలను సృష్టించి మరికొందరికి స్ఫూర్తినివ్వడమే కాదు కొత్త ట్రెండ్ కి దారి చూపిస్తున్నారు
This post was last modified on April 2, 2023 3:22 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…