జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా షూటింగ్ మొదలయ్యే క్షణాల కోసం అభిమానుల నిరీక్షణ ఇప్పటిది కాదు. ఆర్ఆర్ఆర్ తర్వాత త్రివిక్రమ్‌తో అనుకున్న సినిమా క్యాన్సిల్ అయి.. కొరటాల శివతో కొత్త చిత్రాన్ని ప్రకటించి రెండేళ్లు దాటిపోయింది. ఈ సినిమా రకరకాల కారణాల వల్ల బాగా ఆలస్యం అయింది. ఆర్ఆర్ఆర్‌కు సంబంధించి తారక్ అన్ని పనులూ ముగించాక కూడా ఏడాదికి కానీ ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోలేదు.
కొన్ని రోజుల కిందటే హైదరాబాద్‌లోని ఒక హోటల్లో ఈ సినిమా ముహూర్త వేడుక జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకే చాలా టైం తీసుకోవడంతో ఇక షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడో అని అభిమానులు సందేహించారు. కానీ వాళ్లు ఎక్కువ రోజులు నిరీక్షించాల్సిన అవసరం లేకపోయింది. శనివారమే ఈ సినిమా షూటింగ్ మొదలైపోయింది.
ఎన్టీఆర్ కొత్త సినిమా అప్‌డేట్స్ కోసం అభిమానులు విపరీతంగా గొడవ చేస్తుండటాన్ని చాలా రోజులుగా గమనిస్తూనే ఉన్నాం. ఈ విషయంలో తారక్ సైతం కొంత అసహనం వ్యక్తం చేశాడు. ఐతే షూటింగ్ మొదలైన విషయాన్ని చిత్ర బృందం అధికారికంగానే ఒక వీడియో ద్వారా వెల్లడించింది. నైట్ సెటప్‌తో ఉన్న సెట్లోకి ఎన్టీఆర్ నడుచుకుంటూ వెళ్లడం.. అతణ్ని కొరటాల శివ ఆహ్వానించడం ఈ వీడియోలో చూపించారు.
ఐతే తారక్‌ను వెనుక నుంచి మాత్రమే చూపించారు. లుక్ రివీల్ చేయలేదు. చూస్తుంటే.. తారక్ గడ్డంతో షూట్‌కు హాజరైనట్లు కనిపిస్తోంది. సెట్‌ను డీప్‌గా చూపించకపోయినా.. లావిష్‌గానే ఉన్నట్లు కనిపిస్తోంది. వీడియో చివర్లో వస్తున్నా.. అంటూ ఎన్టీఆర్ ఆగమనాన్ని చాటి చెప్పారు. తారక్ సరసన జాన్వికపూర్ నటించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5కు విడుదల కాబోతున్నట్లు ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే.
This post was last modified on April 2, 2023 8:38 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…