సినీ పరిశ్రమలో ఫోకస్ అంతా ఎప్పుడూ హీరో హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకుల చుట్టూనే తిరుగుతుంటుంది. నటీనటుల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుల గురించి.. టెక్నీషియన్లలో మిగతా వారి గురించి పట్టించుకునేవారు తక్కువ. మీడియాలో కూడా వీరికి పెద్దగా ప్రాధాన్యం దక్కదు. చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టుల పేర్లు కూడా తెలియకుండానే ఏళ్లకు ఏళ్లు గడిచిపోతుంటాయి. కొద్దిమంది మాత్రమే పాపులర్ అవుతారు.
మీడియాలో, సోషల్ మీడియాలో హైలైట్ అవుతారు. తెలుగు విషయానికి వస్తే రావు రమేష్ లాంటి కొద్దిమంది మాత్రమే పాపులర్. ఎంతో ప్రతిభ ఉండి కూడా మరుగున పడిపోయిన క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. ఈ మధ్య గోపరాజు రమణ అనే ఒక ప్రతిభావంతుడైన క్యారెక్టర్ ఆర్టిస్టు వెలుగులోకి వచ్చాడు. ఆయన చాలా ఏళ్లు సీరియళ్లతో పాటు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో నెట్టుకొచ్చారు. మిడిల్ క్లాస్ మెలోడీస్, అశోక వనంలో అర్జున కళ్యాణం, స్వాతిముత్యం లాంటి సినిమాలు ఆయన పేరు జనాలకు తెలిసేలా చేశాయి.
ఇప్పుడు ఇలాంటి ఇంకో ప్రతిభావంతుడైన క్యారెక్టర్ ఆర్టిస్టు వెలుగులోకి వస్తున్నాడు. ఆయన పేరు.. మురళీధర్ గౌడ్. ఈ పేరు చెబితే ఆ మనిషి ఎవరు అనేది తెలియకపోవచ్చు. కానీ ‘డీజే టిల్లు’లో సిద్ధు జొన్నలగడ్డ తండ్రిగా నటించిన వ్యక్తి అంటే వెంటనే కనెక్ట్ అవుతారు. ఈ సినిమా కంటే ముందే చాలా చిత్రాల్లో నటించినా మురళీధర్‌కు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ డీజే టిల్లులో నేచురల్ పెర్ఫామెన్స్‌తో మురళీధర్ గౌడ్ బలమైన ముద్రే వేశాడు.
ఆ తర్వాత మరికొన్ని చిత్రాలు ఆయనకు పేరు తెచ్చాయి. లేటెస్టుగా ‘బలగం’ సినిమయాతో ఆయన పేరు మార్మోగుతోంది. ఇందులో తన భార్య పుట్టింటి వాళ్లు తనను గౌరవించలేదని అలిగి ఏళ్ల పాటు ఆ ఇంటి గడప తొక్కని అల్లుడి పాత్రలో ఆయన అదరగొట్టేశారు. ఈ సినిమాతో మురళీధర్‌కు మామూలు పేరు రాలేదు. ఆయన పేరు ఇప్పుడు అందరికీ బాగానే తెలుస్తోంది. విశేషం ఏంటంటే.. మురళీధర్ సినిమాల్లోకి అనుకోకుండా వచ్చారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్లో పని చేస్తూ అప్పుడప్పుడూ నాటకాలు వేసిన ఆయన.. రిటైర్మెంట్ తర్వాత సినిమాల్లోకి వచ్చి పేరు సంపాదించడం విశేషం.
This post was last modified on April 1, 2023 5:15 pm
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…