నాగార్జున చాలా మంది దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఎప్పుడూ కొత్త కథలు , కొత్త దర్శకులకే ఇంపార్టెన్స్ ఇచ్చే నాగ్ త్వరలోనే రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ మలయాళం రీమేక్ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ పూర్తయింది. జనవరిలో ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది, కానీ ఇవ్వలేదు.
ఆ తర్వాత ఈ సినిమాకు రీమేక్స్ రైట్స్ చిక్కు వచ్చి పడింది. ప్రసన్న అభిషేక్ అగర్వాల్ తో మూడేళ్ళ క్రితం మలయాళం పెరింజు మరియమ్ జోస్ అనే రీమేక్ రైట్స్ కొనిపించాడు. ఇప్పుడు ఆ రైట్స్ తీసుకొని ప్రసన్న నాగార్జునతో శ్రీనివాస చిట్టూరి నిర్మాణంలో ఆ రీమేక్ ప్లాన్ చేసుకున్నాడు.
దీంతో రైట్స్ సొంతం చేసుకున్న అభిషేక్ అగర్వాల్ సీన్ లోకి ఎంటరై తను ఆ సినిమాను రీమేక్ చేయబోతున్నట్లు ప్రకటన రిలీజ్ చేశారు. దాదాపు ఇరవై రోజులుగా ఈ రైట్స్ తో లోలోపల హాట్ హాట్ డిస్కషన్ నడుస్తూనే ఉంది. ఇంకా రైట్స్ గొడవ ఓ కొలిక్కి రాలేదని తెలుస్తుంది. దీంతో ఇండస్ట్రీలో అందరూ నాగ్ కొత్త దర్శకుడితో భలే ఇబ్బందులు పడుతున్నాడే అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు.
ప్రసన్న ఈ రీమేక్ ను తన స్టైల్ లో మార్పులతో తెరకెక్కించబోతున్నాడు. అమలాపురం పరిసర ప్రాంతాల్లో రెక్కీ కూడా చేసుకొని వచ్చాడు. అల్లరి నరేష్ , రాజ్ తరుణ్ లను రెండు పాత్రలకు లాక్ చేసుకున్నాడు. ఏప్రిల్ లేదా మేలో ఘాట్ మొదలు పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక సీనియర్ హీరోతో అవుట్ డోర్ ఘాట్ కాబట్టి సమ్మర్ పూర్తయ్యాకే సినిమా సెట్స్ పైకి వెళ్ళే ఆలోచనలో కూడా మేకర్స్ ఉన్నారు.
This post was last modified on March 31, 2023 11:20 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…