ఒక బ్లాక్ బస్టర్ సినిమా రీ రీలీజ్ అంటే భారీ హంగామా ఉండనే ఉంటుంది. ఈ మధ్య వచ్చిన ‘పోకిరి’, ‘జల్సా’ ,’ఒక్కడు’ ఇలా చాలా సినిమాలకు మంచి రెస్పాన్స్ దక్కింది. అయితే రామ్ చరణ్ తన డిజాస్టర్ సినిమా రీ రీలీజ్ తో సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. బొమ్మరిల్లు భాస్కర్ తో రామ్ చరణ్ చేసిన రెండో సినిమా ఆరేంజ్ అప్పట్లో డిజాస్టర్ అనిపించుకుంది.
నిర్మాతగా నాగబాబుకి కంటికి కునుకు లేకుండా చేసి అప్పుల పాలు చేసింది. అయితే ఈ సినిమాను మెగా ఫ్యాన్స్ రీ రిలీజ్ చేయాలని భావించి నాగబాబును ముందుకు తీసుకొచ్చారు. చరణ్ పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజైన ఆరేంజ్ ఎవరూ ఊహించని విధంగా మూడు రోజుల్లో మూడు కోట్లు కొల్లగొట్టి ఓ రేంజ్ అనిపించుకుంది. అయితే అప్పట్లో ఆరేంజ్ డిజాస్టర్ కావొచ్చు. కానీ చరణ్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కి ఈ సినిమా ఫేవరెట్.
ముఖ్యంగా సాంగ్స్ కోసం ఈ సినిమాను మళ్ళీ చూసే ఆడియన్స్ ఉన్నారు. అదే రీ రిలీజ్ కి బాగా వర్కవుట్ అయ్యింది. RRR లో నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ రావడం , చరణ్ గ్లోబల్ వైజ్ గుర్తింపు తెచ్చుకోవడంతో మెగా ఫ్యాన్స్ ఆరేంజ్ తో ఆ సంతోషాన్ని సెలెబ్రేట్ చేసుకున్నారు. అయితే ఆరేంజ్ కేవలం సింగిల్ స్క్రీన్స్ లోనే రిలీజ్ అయింది. ఈ సినిమాకు సిటీలో మల్టీప్లెక్స్ లు దొరకలేదు. మల్టీప్లెక్స్ మేనేజ్మెంట్ తో రిలీజ్ చేసిన వారికి డీలింగ్ సెట్ కాకపోవడంతో అక్కడ ఎఫెక్ట్ పడింది. లేదంటే ఇంకా భారీ కలెక్షన్స్ వచ్చేవి.
ఫైనల్ గా మూడు కోట్లతో డిజాస్టర్ సినిమా ఇప్పుడు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. త్వరలోనే ఈ సినిమా రీ రిలీజ్ ద్వారా వచ్చిన ఎమౌంట్ ను జనసేన పార్టీకి ఫండ్ ఇవ్వనున్నారు. ఏదేమైనా చరణ్ డిజాస్టర్ సినిమాతో ఇన్నేళ్ల తర్వాత తన సత్తా చాటి మెగా పవర్ స్టార్ నిపించుకున్నాడు.
This post was last modified on March 31, 2023 8:17 pm
"విచారణకు రండి. ఈ నెల 18న హాజరై మాకు సహకరించండి. వచ్చేప్పుడు మీ వద్ద ఉన్న ఆధారాలు వివరాలు కూడా…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పనులు పున:ప్రారంభానికి ముహూర్తం ఖరారు అయ్యింది. మే నెల 2న అమరావతి రానున్న ప్రధాన…
వైసీపీ నాయకుడు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డిపై తిరుమల తిరుపతి దేవస్థానం ఫిర్యాదు చేసింది. తిరుపతి జిల్లా ఎస్పీ…
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు బ్యాలన్స్ ఉన్నవి కాకుండా కొత్త సినిమాలు ఏవీ చేస్తారనే దాని గురించి రకరకాల…
తన పాటలు, ట్యూన్లు ఎవరు వాడుకున్నా వాళ్ళను విడిచిపెట్టే విషయంలో రాజీపడని ధోరణి ప్రదర్శించే ఇళయరాజా ఈసారి గుడ్ బ్యాడ్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు.. సోనియా గాంధీ అల్లుడు.. ప్రియాంక గాంధీ భర్త.. రాబర్ట్ వాద్రాను ఎన్ ఫోర్స్మెంటు డైరెక్టరేట్ (ఈడీ)…