మాములుగా స్టార్ హీరోల సినిమాలకు అన్ని వర్గాలు చూసే విధంగా సెన్సార్ సర్టిఫికెట్ తెచ్చుకుంటారు. ఒకవేళ అధికారులు ఏదైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే దానికి తగ్గట్టు మ్యూట్లు కట్లు చేసుకుని కనీసం యు/ఏ తో సర్దుకుంటారు. కేవలం A అంటే అడల్ట్స్ ఓన్లీ (పెద్దలకు మాత్రమే) ఇస్తే మాత్రం ప్రాక్టికల్ గా చాలా ఇబ్బందులుంటాయి. 18 ఏళ్ళ వయసు లోపలి వాళ్ళను థియేటర్లో అనుమతించడానికి అవకాశం ఉండదు.
చాలా మటుకు సింగల్ స్క్రీన్లు దీన్ని పట్టించుకోకుండా టికెట్ ఉంటే చాలు పంపిస్తాయి. కానీ అధిక శాతం మల్టీప్లెక్సులు కఠినంగా అమలు చేస్తాయి. తాజాగా రవితేజ రావణాసురకు A వచ్చింది. అంటే వయొలెన్స్ ఏదో గట్టిగానే దట్టించారన్న మాట. క్రైమ్ థ్రిల్లర్ అనే హింట్ ఆల్రెడీ ట్రైలర్ లో ఇచ్చారు కానీ కామెడీ పాటలు తదితర అంశాలు ఉన్నట్టు చూపించారు కాబట్టి ఫ్యామిలీస్ ఛాయస్ గా పెట్టుకోవచ్చనే అందరూ అనుకున్నారు.
తీరా చూస్తే ఇప్పుడీ ట్విస్టు. దర్శక నిర్మాతలు ఒరిజినాలిటీ పోకూడదని ఇలా రా వెర్షన్ ని ఇవ్వాలనుకున్నారో ఏమో తెలియదు. ముప్పై ఆరు కట్లు ఇచ్చిన దసరానే యు/ఏతో బయట పడింది. అందులోనూ హింస ఓ రేంజ్ లో ఉంది. జనం దాన్నేమీ పట్టించుకోకుండా హిట్ చేశారు. మరి రావణాసురలో అంత వయొలెంట్ కంటెంట్ ఏముందో చూడాలి.
సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మొత్తం ఆరుగురు హీరోయిన్లు కనిపిస్తారట. సుశాంత్ చాలా కీలకమైన పాత్ర పోషించాడు. ధమాకా, వాల్తేరు వీరయ్య వరస సక్సెస్ ల తర్వాత రావడంతో ఈ మూవీ మీద మంచి క్రేజ్ అయితే ఉంది. కానీ గ్రౌండ్ లెవెల్ లో ఆశించిన స్థాయిలో బజ్ పెరగడం లేదు. అందుకే ప్రమోషన్ స్పీడ్ పెంచారు. ఇప్పుడు చూస్తేనేమో సెన్సార్ ఏ ఇచ్చింది. రవితేజ రిస్క్ చేసి ఏదైనా ప్రయోగానికి సిద్ధపడినందు వల్లే ఇలా జరిగిందో ఏమో లెట్ వెయిట్ అండ్ సీ.
This post was last modified on March 31, 2023 8:08 pm
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…