రాజమౌళిని దింపేసిన వినాయక్

కొంత గ్యాప్ తర్వాత దర్శకుడు వీవీ వినాయక్ ఛత్రపతి రీమేక్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాతో శ్రీనివాస్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అందుకోసం రాజమౌళి -ప్రభాస్ కాంబోలో వచ్చిన ఒకప్పటి బ్లాక్ బస్టర్ ఛత్రపతి రీమేక్ ను ఎంచుకున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ను ఎప్పుడో పూర్తయింది.

మధ్యలో కొన్ని ఇబ్బందుల వల్ల రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకొని ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు. మే 12 న హిందీలో రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా ఓ టీజర్ వదిలారు. టీజర్ ను యాక్షన్ గ్లిమ్స్ కంటెంట్ తో నింపేశారు.

రాజమౌళిని మక్కీ కీ మక్కీ ఫాలో అయ్యాడు వినాయక్. అయితే ఛత్రపతిని మించి ఇందులో కొత్త యాక్షన్ ఎపిసోడ్స్ ను పెట్టడాని టీజర్ చూస్తే తెలుస్తుంది. హీరో మెడలో శంఖం నుండి సన్నివేశాల వరకు ఎలాంటి మార్పులు లేకుండా ఈ యాక్షన్ డ్రామా సినిమాను తీశాడు వినాయక్.

అయితే ఛత్రపతి టీజర్ లో యాక్షన్ గ్లిమ్స్ చూస్తే బెల్లంకొండకి ఇది పర్ఫెక్ట్ బాలీవుడ్ డెబ్యూ అనిపిస్తుంది. బెల్లంకొండ యాక్షన్ సినిమాలకు నార్త్ లో మంచి క్రేజ్ ఉంది. డబ్బింగ్ సినిమాలతో అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా జయజానకీ నాయక హిందీ మూవీతో భారీ వ్యూస్ కొల్లగొట్టి రికార్డ్ క్రియేట్ చేశాడు. మరి బెల్లంకొండ డెబ్యూకి అక్కడ ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ? చూడాలి.