నేచురల్ స్టార్ నాని ‘దసరా’ సినిమాతో హీరోగా కొన్ని మెట్లు ఎక్కేసినట్లే కనిపిస్తున్నాడు. ఈ సినిమాకు వస్తున్న ఓపెనింగ్స్ చూసి ఇండస్ట్రీ జనాలు కూడా షాకయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈసారి వేసవికి టాప్ స్టార్లు నటించిన భారీ చిత్రాలేవీ రావడం లేదు. దీంతో మిడ్ రేంజ్ సినిమాల మీదే ఎక్కువ ఆశలు, అంచనాలు ఉన్నాయి. వాటిలో ‘దసరా’ అత్యంత క్రేజ్ తెచ్చుకుంది.
వేసవిలో వస్తున్న తొలి క్రేజీ మూవీ కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక వరల్డ్ వైడ్ ఈ సినిమాకు భారీ రిలీజ్ దక్కింది. మిడ్ రేంజ్ సినిమాల్లో అత్యంత భారీగా రిలీజవుతున్న సినిమా ఇదే. సినిమాకు మంచి క్రేజ్ ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరుగానే జరిగాయి. ఓపెనింగ్స్ కూడా అంచనాలను మించే ఉండబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. యుఎస్‌లో ‘దసరా’ ప్రి సేల్స్ చూసి అక్కడి ట్రేడ్ వర్గాలు షాకైపోయాయి.
యుఎస్ ప్రిమియర్స్ ద్వారా ‘దసరా’ సినిమా 6 లక్షల డాలర్లు కొల్లగొట్టడం విశేషం. ప్రిమియర్స్‌తోనే హాఫ్ మిలియన్ మార్కును టచ్ చేయడం అంటే చిన్న విషయం కాదు. టాప్ హీరోల్లో కూడా అందరికీ ఇది సాధ్యమయ్యే ఘనత కాదు. మెగాస్టార్ చిరంజీవి సినిమా సంక్రాంతి లాంటి క్రేజీ సీజన్లో రిలీజై ప్రిమియర్స్‌తో దాదాపు 7 లక్షల డాలర్లు రాబట్టింది.
ఇప్పుడు నాని సినిమా దానికి చేరువగా వెళ్లింది. ఈ సినిమాకు ప్రిమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్ అంతా దున్నేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఆదివారం షోలన్నీ అయ్యేసరికి సినిమా 2 మిలియన్ డాలర్ల మార్కును టచ్ చేసేసినా ఆశ్చర్యం లేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమాకు భారీ ఓపెనింగ్స్ గ్యారెంటీగా కనిపిస్తున్నాయి. ఈజీగా 10 కోట్ల ప్లస్ ఓపెనింగ్స్‌ను ‘దసరా’ అందుకునేలా ఉంది. నానీకిది వంద కోట్ల సినిమా అయినా ఆశ్చర్యం లేదేమో.
This post was last modified on March 30, 2023 12:07 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…