ఇరవై రోజుల క్రితం నెట్ ఫ్లిక్స్ లో భారీ అంచనాల మధ్య విడుదలైన నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ రానా నాయుడుకు కాంప్లిమెంట్స్ కంటే ఎక్కువగా నెగటివ్ కామెంట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగునాట ఫ్యామిలీ హీరోగా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న విక్టరీ వెంకటేష్ లాంటి సీనియర్ హీరోని ఇలాంటి కంటెంట్ లో చూడటం పట్ల అధిక శాతం అభిమానులే అసంతృప్తిగా ఫీలయ్యారు.
ప్రమోషన్ల టైంలో ఇది కేవలం పెద్దలకు మాత్రమేనని రానా నొక్కి చెప్పినప్పటికీ స్టార్ క్యాస్టింగ్ వల్ల చూడకుండా ఉండలేకపోయిన సగటు జనాలు లక్షల్లో ఉన్నారు. డబ్బింగ్ లోనూ బూతులు యథాతథంగా పెట్టేయడం విమర్శలకు కారణమయ్యింది. ఇవి దగ్గుబాటి బృందానికి చేరాయో లేక నెట్ ఫ్లిక్స్ స్వంతంగా పూనుకుందో తెలియదు కానీ హఠాత్తుగా రానా నాయుడుకి తెలుగు ఆడియో తీసేశారు.
ప్రస్తుతం ఒరిజినల్ హిందీ, తమిళం, మళయాలం, ఇంగ్లీష్ మాత్రమే అందుబాటులో ఉంది. సబ్ టైటిల్స్ లోనూ హిందీ ఇంగ్లీష్ తప్ప ఇంకే ఇతర భాషలు లేవు. తిరిగి ఫ్రెష్ గా అనువాదాన్ని సెన్సార్ చేయించి జోడిస్తారా లేక ఇక్కడితో తెలుగుకి మంగళం పాడేసి సర్దుకోమంటారానేది ఇంకొద్ది రోజులు వేచి చూశాక క్లారిటీ వస్తుంది. తెరవెనుక ఏం జరిగిందనేది పక్కనపెడితే రానా నాయుడుకి వచ్చిన స్పందన ఇతర స్టార్ హీరోలను జాగ్రత్త పడేలా చేసింది.
కొత్త ట్రెండ్, భారీ రెమ్యునరేషన్లు, కోట్లలో బడ్జెట్ లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అసలు స్క్రిప్ట్ ని పూర్తిగా శల్యపరీక్ష చేసుకోకపోతే ఏం జరుగుతుందో అర్థమయ్యింది. రానా నాయుడు సెకండ్ సీజన్ గురించి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఆల్రెడీ తీసేసారా లేక త్వరలో మొదలుపెడతారా అనేది సస్పెన్స్. ముందస్తు అగ్రిమెంట్ అయితే రెండు భాగాలనే రాసుకున్నారట. తీయాలా వద్దానేది ఫైనల్ గా నెట్ ఫ్లిక్స్ చేతుల్లోలోనే ఉంటుంది.
This post was last modified on March 30, 2023 10:37 am
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…