ఇది సోషల్ మీడియా కాలం. ఏదైనా కొత్త సినిమా పోస్టరో.. టీజరో రిలీజైతే జస్ట్ అలా చూసి ఓకే అనుకుని వదిలేయరు ఇప్పటి ప్రేక్షకులు. ప్రతిదాంట్లోనూ హిడెన్ డీటైల్స్ బయటికి తీసే ఒక పోస్టర్ మీద కూడా పెద్ద వ్యాసం రాసేంత కంటెంట్ ఇచ్చేస్తున్నారు. ఈ మధ్యే విడుదలైన నాగశౌర్య కొత్త సినిమా పోస్టర్‌ను శోధించి ఓ ఆసక్తికర విషయం బయటికి తీశారు నెటిజన్లు.
ఈ ఫస్ట్ లుక్‌లో కండలు తిరిగిన దేహంతో నాగశౌర్య భలేగా కనిపించాడు. అతడి ట్రాన్స్‌ఫర్మేషన్ చూసి అంతా షాకయ్యారు. ఈ సినిమా ఓ ప్రాచీన యుద్ధ కళ నేపథ్యంలో సాగుతుందని చిత్ర బృందం వెల్లడించింది. కానీ శౌర్య లుక్ మాత్రం అందుకు చాలా మోడర్న్‌గా కనిపించింది. ఇక శౌర్య లుక్ గురించి నెటిజన్లు కనిపెట్టిన విషయం ఏంటంటే.. అతను రూ.11 వేలకు పైగా ఖరీదైన అండర్ వేర్ ధరించాడట.
జీన్స్ ప్యాంటు కింద అండర్ వేర్ బ్రాండ్ కనిపించేలా ఫస్ట్ లుక్ తయారు చేశారు. ఆ బ్రాండు.. ఫిలిప్ ప్లీన్. అత్యంత ఖరీదైన మెన్స్ ఇన్నర్ వేర్ బ్రాండు ఇది. దీని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్స్, జోకులు పేలుతున్నాయి. ‘అతడు’ సినిమాలో తనికెళ్ల భరణి డైలాగ్‌ను గుర్తు చేస్తూ.. ‘‘అంత ఖరీదెందుకు రా బుజ్జీ.. లోపలేమైనా ఏసీ ఉంటుందా’’ అంటూ ఒక మీమ్ తయారు చేయడం విశేషం.
ఇదిలా ఉంటే.. మన తెలుగు సినిమాల్లో హీరో ఎంత సామాన్యుడైనా సరే.. ఖరీదైన బ్రాండెడ్ బట్టలు వేయాల్సిందే అన్నది మరోసారి స్పష్టమైంది. మన ఫిలిం మేకర్లు పాత్రలు, వాటి లుక్స్ విషయంలో రియలిస్టిగ్గా ఉండరు అనడానికి దీన్ని నిదర్శనంగా చూపిస్తున్నారు. ఈ బ్రాండ్ ఇన్నర్ వేర్ వేయాలంటే హీరో మల్టీ మిలియనీర్‌గా కనిపించాలి. కానీ సినిమాలో హీరో పాత్ర సామాన్యుడిగా కనిపించేలా ఉంది. మరి ఆ పాత్ర ఇంత ఖరీదైన అండర్ వేర్ వేస్తే ఔచిత్యం దెబ్బ తింటుంది కదా. ఫస్ట్ లుక్ వరకు ఇలా అవసరం లేని ‘రిచ్నెస్’ చూపించినా.. సినిమాలో మాత్రం ఇలాంటి విషయాల్లో జాగ్రత్త పడాల్సిందే.
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
వైసీపీ అధినేత జగన్ మరో సోదరి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత.. మరోసారి రం గంలోకి దిగారు.…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈరోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలతోపాటు పలు విషయాలు చర్చకు…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఈ క్రమంలోనే అభివృద్ధి వికేంద్రీకరణ,…
ఏపీ మాజీ సీఎం జగన్ పై ఆయన సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చాలాకాలంగా తీవ్ర స్థాయిలో…
రాజధానిగా అమరావతిని గుర్తించడంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు.. ఈ క్రమంలో తీసుకు న్న రెండు కీలక నిర్ణయాలు.. తాజాగా…