టాలీవుడ్ యువ కథానాయకుడు రామ్ ఈ రోజు ఉదయం ఒక ట్వీట్ వేశాడు. తన ‘కందిరీగ’ సినిమాలో విలన్‌గా నటించిన సోనూ సూద్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ వేసిన ట్వీట్ అది. బహుశా రామ్ ఇంత వరకు ఏ బాలీవుడ్ హీరోకైనా ఇలా విష్ చేశాడా అన్నది సందేహమే. అలాగే తనతో కలిసి నటించిన నటీనటులందరికీ కూడా ఇలా విష్ చేసే అలవాటు రామ్‌కు లేదు.
ఇలా తాను నటించిన ఓ సినిమాలో విలన్‌గా చేసిన నటుడికి గొప్ప ఎలివేషన్ ఇస్తూ అతను ట్వీట్ వేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. దీన్ని బట్టి ఇప్పుడు సోనూ రేంజ్ ఏంటో అంచనా వేయొచ్చు. రామ్ విష్ ఓ ఉదాహరణ మాత్రమే. ఇలా ఎంతోమంది సెలబ్రెటీలు సోనూను పొగుడుతూ ట్వీట్లు వేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో మామూలు జనాల స్పందన అయితే మామూలుగా లేదు. ఒక పెద్ద సూపర్ స్టార్ రేంజిలో అతడిక ఎలివేషన్లు కనిపిస్తున్నాయి.
అతడి మీద ఎన్నో ఎడిట్లు.. ఒక్కోదాని వ్యవహారం చూస్తే సోనూ మీద ఇంత అభిమానమా అనిపిస్తుంది. ఇదేమీ సినిమాల ద్వారా వచ్చిన అభిమానం కాదు. లేదంటే హీరోల పీఆర్వోలు వెనుకండి నడిపిస్తున్న వ్యవహారమూ కాదు. కరోనా విలయం మొదలయ్యాక వలస కార్మికులు సహా ఎందరో అభాగ్యులను ఆదుకున్న సోనూ మీద నిజంగా వెల్లువెత్తిన అభిమాన ఫలితమిది.
ఓ ఫిలిం సెలబ్రెటీ నిజ జీవితంలో చేసిన మంచి పనులకు ఈ స్థాయిలో స్పందన రావడం.. జనాల్లో ఇంత అభిమానం వెల్లువెత్తడం అరుదైన విషయం. అతడి ఫాలోయింగ్, తన మీద కురుస్తున్న అభిమానం చూసి సూపర్ స్టార్లకు కూడా గుబులు పుడుతుందేమో. రూపాయి సాయం చేసి పది రూపాయల ప్రచారం పొందాలని చూసే అందరికీ.. ఏమీ ఆశించకుండా, చిత్తశుద్ధితో సాయం చేస్తే జనాల నుంచి నిజమైన అభిమానం ఎలా పొందవచ్చో చెప్పడానికి ఇది ఒక పాఠం అనడంలో సందేహం లేదు.
This post was last modified on July 30, 2020 4:13 pm
ఏకంగా 7500 కోట్ల రూపాయలను మంచి నీళ్ల ప్రాయంలా ఖర్చు చేశారు. మరో వారం రోజుల్లో మహా క్రతువ ను…
https://youtu.be/yCkl2Z3PBs0?si=YrheiH3HjVyB7nwZ పండగ పేరునే టైటిల్ గా పెట్టుకుని బరిలో దిగుతున్న సంక్రాంతికి వస్తున్నాం మీద ముందు ఏమో కానీ పాటలు,…
ప్రతి సంవత్సరం టాలీవుడ్ సంక్రాంతికి ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగుదునమ్మా అంటూ తమిళ డబ్బింగులు రావడం ఏళ్లుగా జరుగుతున్న…
రాష్ట్రానికి సంబంధించి విజన్-2047 ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు.. తాజాగా తన సొంత నియోజక వర్గం.. 35 ఏళ్ల నుంచి వరుస…
ఏపీలో కూటమి ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తోందని మంత్రి నారా లోకేష్ చెప్పారు. అయితే..ఈ పాపం అంతా వైసీపీ అధినేత,…
గత ఏడాది ది రాజా సాబ్ కు అధికారికంగా ప్రకటించిన విడుదల తేదీ 2025 ఏప్రిల్ 10. కానీ ఇప్పుడా…