జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందబోయే ప్యాన్ ఇండియా సినిమా విషయంలో రాజీ మాటే లేకుండా చాలా బలమైన సాంకేతిక వర్గాన్ని సెట్ చేస్తున్నారు. బడ్జెట్ బయటికి చెప్పకపోయినా తారక్ కెరీర్ లోనే అత్యంత భారీగా రూపొందబోయే చిత్రం ఇదే అవుతుంది. ఆర్ఆర్ఆర్ ఉన్నప్పటికీ అది సోలో హీరోగా కాదు కాబట్టి పూర్తి పరిగణనలోకి రాదు.
తాజాగా బ్రాడ్ మిన్నిచ్ ని విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ గా తీసుకోవడం ఆయన గురించి తెలిసిన వాళ్లకు మంచి ఎలివేషన్ ఇస్తోంది. అవగాహన లేని ఫ్యాన్స్ కు ఈయన ఎవరబ్బా అనిపించొచ్చు కానీ కథ వేరే ఉంది. బ్రాడ్ మిన్నిచ్ సుప్రసిద్ధ హాలీవుడ్ విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడు. ఈయన పనితనం గురించి తెలియాలంటే బ్యాట్ మాన్ వర్సెస్ సూపర్ మ్యాన్, జస్టిస్ లీగ్, పోకెమోన్ డిటెక్టివ్ పికచు, ఆక్వామ్యాన్, 300 రైజ్ అఫ్ ది ఎంపైర్, ది ట్విలైట్ సాగా, ది గుడ్ లార్డ్ బర్డ్ టెలివిజన్ సిరీస్ చూస్తే అర్థమైపోతుంది.
అయితే బ్రాడ్ కి ఇది ఫస్ట్ ఎంట్రీ కాదు. ప్రాజెక్ట్ కె కోసం దర్శకుడు నాగ అశ్విన్ ఆల్రెడీ ఇతనితో కలిసి పని చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీలో గ్రాఫిక్స్ ఎంత కీలక భాగం వహించనున్నాయో గతంలో చెప్పిన సంగతి తెలిసిందే.
ఇపుడు ఎన్టీఆర్ కోసం తీసుకురావడం చూస్తే సెటప్ ఓ రేంజ్ లో ఉందని అర్థమైపోతుంది. ట్యాంకర్లలో కృత్రిమ రక్తం తీసుకురావడం, పోర్టు సెట్ ని అత్యంత భారీగా నిర్మించడం, క్యాస్టింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం మొత్తానికి కొరటాల శివ కసి మాములుగా కనిపించడం లేదు. ఇంకో వారం రోజుల్లోపే రెగ్యులర్ షూటింగ్ నాన్ స్టాప్ గా జరగనుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతం ప్రధాన ఆకర్షణ కానుంది. గతంలో జెర్సీ, గ్యాంగ్ లీడర్, అజ్ఞాతవాసి చేసినప్పటికీ తన స్థాయి బ్రేక్ ఇంకా టాలీవుడ్ లో దక్కలేదు.
This post was last modified on March 28, 2023 4:56 pm
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…