మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB28 కి సంబంధించి మేకర్స్ ఇంకా టైటిల్ ఫైనల్ చేయలేదు. ‘గుంటూరు కారం’ , ‘అమరావతికి అటు ఇటు’ అనే టైటిల్స్ లిస్ట్ అవుట్ చేసుకున్నారు కానీ ఇప్పుడు మరో టైటిల్ కోసం చూస్తున్నారు. ఈసారి క్లాస్ కాకుండా మాస్ టైటిల్ కే ఓటేయాలని మహేష్ , త్రివిక్రమ్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.
నిర్మాతలు మాత్రం త్రివిక్రమ్ స్టైల్ లోనే క్లాస్ టైటిల్ అయితేనే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమా అప్ డేట్స్ కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ ను రిలీజ్ డేట్ తో పోస్టర్ వదిలి సంతోష పెట్టారు. నెక్స్ట్ అప్ డేట్ మే నెలలో ఉండబోతుందని తాజాగా నిర్మాత నాగ వంశీ ప్రకటించాడు.
సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్ డే కి మరో అప్ డేట్ ఇవ్వబోతున్నట్లు తెలిపాడు. మహేష్ కి నాన్న అంటే ఎంతో గౌరవం , ప్రేమ. అలాగే ఆయన పుట్టిన రోజు సెంటిమెంట్ కూడా ఉంది. ప్రతీ ఏడాది తండ్రి జన్మదినం రోజు తన సినిమా అప్ డేట్ ఇచ్చి ఫ్యాన్స్ ను ఖుషి చేయడం మహేష్ కి ఇష్టం, సెంటిమెంట్ కూడా.
అదే సెంటిమెంట్ తో ఇప్పుడు కృష్ణ గారి పుట్టిన రోజు నాడు SSMB28 టైటిల్ తో ఓ పోస్టర్ లేదా టీజర్ రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నాడు మహేశ్. సినిమా సంక్రాంతి కి రానుంది కనుక మేనెలలో ఒక అప్ డేట్ ఇచ్చేసి మళ్ళీ నవంబర్ లేదా డిసెంబర్ నుండి ప్రమోషన్స్ మొదలు పెడతారు. ఈ ఏడాది కృష్ణ గారి పుట్టినరోజు క్రేజీ అప్ డేట్ తో ఫ్యాన్స్ కి ఆయనను గుర్తుచేస్తూ మహేష్ తండ్రిను స్మరించుకొనున్నాడు.
This post was last modified on March 28, 2023 11:54 am
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…