Movie News

రామ్ చరణ్ 15 ‘గేమ్ ఛేంజర్’

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 15 టైటిల్ ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా బయటికి వచ్చేసింది. శంకర్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా రేంజ్ లో వందల కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ పొలిటికల్ కం యాక్షన్ డ్రామాకు గేమ్ చేంజర్ పేరుని లాక్ చేశారు. గత కొన్ని నెలలుగా దీని మీద చాలా ప్రచారాలే జరిగాయి.

సర్కారోడు, సిఈఓ, అధికారి, అప్పన్న ఇలా ఎన్నో బయటకు వచ్చాయి. కానీ అవేవి కాకుండా ఊహించనిది ఫిక్స్ చేయడం విశేషం. అన్ని భాషల్లోనూ ఇదే ఉండబోతోంది. మోషన్ పోస్టర్ వీడియోలో కేవలం థీమ్ ని మాత్రమే చూపించారు. శాసన సభ వ్యవస్థను నిర్దేశించే ఎన్నికల అధికారి పాత్రలో చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. దాన్నే చూచాయగా ఓపెన్ చేసి బ్యాక్ డ్రాప్ ఏంటనేది చెప్పారు.

అయితే గేమ్ ఛేంజర్ లాంటి ఇంగ్లీష్ టైటిల్ మాస్ కి ఎంత మేరకు కనెక్ట్ అవుతుందో చూడాలి. గతంలో లెజెండ్ లాంటివి వర్కౌట్ అయ్యాయి కానీ శంకర్ ఈసారి కొంచెం పొడవాటి పేరుని ఎంచుకోవడం అనూహ్యం. రామ్ చరణ్ లుక్ ని ఇవాళ మధ్యాన్నం విడుదల చేయబోతున్నారు. రిలీజ్ డేట్ ఇంకా సస్పెన్స్ గానే ఉంచారు. అంచనాల పరంగా గేమ్ చేంజర్ మీద మీద మాములు హైప్ లేదు.

ఆర్ఆర్ఆర్ ఆస్కార్ సాధించడం దానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో సహజంగానే చరణ్ తారక్ ల తర్వాత సినిమాల మీద ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ లో ఆసక్తి పెరిగిపోయింది. దానికి తగ్గట్టే శంకర్ గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కించారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం ఓ రేంజ్ లో ఉంటుందని ఇన్ సైడ్ టాక్ బలంగా ఉంది. ఏదైతేనేం మొత్తానికి సస్పెన్స్ కి తెరదించుతూ కొంచెం డిఫరెంట్ గా ఫ్యాన్స్ కి సరైన సమయంలో సరైన కానుకే ఇచ్చారు.

This post was last modified on March 27, 2023 9:21 am

Share

Recent Posts

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

2 hours ago

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని

నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…

5 hours ago

ప్యార‌డైజ్ ద‌ర్శ‌కుడు రాజమౌళి ద‌గ్గ‌ర చేరతాడ‌ట‌

ఇండియాస్ నంబ‌ర్ వన్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేయాల‌ని కాబోయే డైరెక్ట‌ర్ కావాల‌నుకున్న ప్ర‌తి వ్య‌క్తికీ…

5 hours ago

ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…

7 hours ago

ఇంద్ర చూపిన దారిలో మిగిలినవీ రావాలి

తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…

9 hours ago

అసలు భయాన్ని థియేటర్‌లో చూపిస్తారేమో

ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…

9 hours ago