సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ని తెగ ఊరిస్తూ వచ్చిన ఎస్ఎస్ఎంబి 28 అఫీషియల్ అప్ డేట్ వచ్చేసింది. 2024 సంక్రాంతిని టార్గెట్ చేసుకుని జనవరి 13 విడుదల చేయబోతున్నట్టు హారికా హాసిని అధికారికంగా ప్రకటించింది. ఒక రోజు ముందు ప్రాజెక్ట్ కె వస్తున్నట్టు వైజయంతి మూవీస్ గతంలోనే లాక్ చేసిన నేపథ్యంలో పోటీకి భయపడకుండా నిర్మాత నాగ వంశీ బృందం నిర్ణయం తీసేసుకుంది. బరిలో ఇంకెవరు ఉంటారోనన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ రేపు ఫస్ట్ లుక్ తో రాబోయే రామ్ చరణ్ 15 కూడా ఇదే పండగ అంటే క్లాష్ ఆసక్తికరంగా మారుతుంది.
పోస్టర్ లో మహేష్ ఊర మాస్ ని రివీల్ చేశారు. పూర్తి మొహాన్ని చూపించకుండా సిగరెట్ తాగుతూ నడుస్తున్న పోస్టర్ ఊర మాస్ గా ఉంది. అయితే టైటిల్ మాత్రం దాచి పెట్టేశారు. అమరావతికి అటుఇటు, గుంటూరు కారం, మొనగాడు ఇలా ఏవేవో పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ హీరో దర్శకుడు ఫైనల్ గా ఒక అభిప్రాయానికి రాలేకపోయారట. ప్రతిదానికి ఫ్యాన్స్ నుంచి మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవ్వడంతో ఇంకొంత కాలం ఆగాలని డిసైడ్ అయ్యారు. ఎలాగూ ఇంకా తొమ్మిది నెలల సమయం ఉంది కాబట్టి ఎలాంటి హడావిడి పోనక్కర్లేదు
కూల్ గా ఇంకా మంచి టైటిల్ ని ఎంచుకోవచ్చు. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో వచ్చిన ఒత్తిడికి సితార సంస్థ తలొగ్గింది. పైగా ఇతర ప్రొడ్యూసర్లు ఫిక్స్ చేసుకోకముందే ముందే జాగ్రత్త పడితే మంచిదనే కోణంలో ఇలా చేసినట్టు కనిపిస్తోంది. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ మాస్ ఎంటర్ టైనర్ కు తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణ కానుంది. ఆగస్ట్ 11న వస్తుందని బోలెడు ఆశలు పెట్టుకున్న అభిమానులు కొంత నిరాశ చెందినా సరిలేరు నీకెవ్వరు – అల వైకుంఠపురములోలు సంక్రాంతికి రికార్డులు బద్దలు కొట్టిన నేపథ్యంలో మహేష్ త్రివిక్రమ్ లకు ఆ సెంటిమెంట్ కూడా కలిసొస్తుంది
This post was last modified on March 26, 2023 6:50 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…