సీనియర్ హీరోలకు హీరోయిన్లను సెట్ చేయడం ఈ రోజుల్లో చాలా చాలా కష్టమైపోతోంది. 70, 80 దశకాల్లో మాదిరి హీరోలు తమ వయసులో మూడో వంతున్న హీరోయిన్లతో ఏ ఫీలింగ్ లేకుండా రొమాన్స్ చేసే పరిస్థితి లేదిప్పుడు. అలా చేస్తే ప్రేక్షకుల నుంచి వెటకారాలు తప్పవు. సీనియర్ల పక్కన యంగ్‌గా అనిపించే హీరోయిన్లను పెడితే.. అదో రకమైన ఫీలింగ్ వచ్చేస్తోంది జనాలకు. వాళ్ల కెమిస్ట్రీ, రొమాన్స్ అస్సలు వర్కవుట్ కావడం లేదు. దీంతో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఈ నలుగురికీ హీరోయిన్ల సమస్య తప్పట్లేదు.
తన చివరి సినిమా ‘ఎఫ్-3’లో తమన్నాతో జోడీ కట్టాడు వెంకీ. ఇప్పుడు ఆయన ‘హిట్’ డైరెక్టర్ శైలేష్ కొలనుతో ‘సైంధవ్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఓ కథానాయికగా రుహాని శర్మను అనుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. ఐతే ఆమెది ఇందులో సెకండ్ హీరోయిన్ పాత్ర అట. మెయిన్ లీడ్ కోసం వేరే అమ్మాయిని ఎంచుకున్నారు. ఆ అమ్మాయి కన్నడ భామ శ్రద్ధ శ్రీనాథ్ అని సమాచారం. శ్రద్ధ ఈ తరం హీరోయినే అయినా.. వెంకీ సరసన ఆమె ఆడ్‌గా ఏమీ అనిపించకపోవచ్చు. తెలుగులో ఆమె నటిస్తున్న అత్యంత పెద్ద సినిమా ఇదే కానుంది. తెలుగులో ఆమెకు కృష్ణ అండ్ హిజ్ లీల, జెర్సీ లాంటి మంచి సినిమాలున్నాయి.
‘సైంధవ్’లో బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖి విలన్ పాత్ర చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వీడియో చూస్తే ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ లాగా కనిపించింది. వెంకీకిది 75వ సినిమా కావడం విశేషం.
This post was last modified on April 3, 2023 9:48 am
మంగళగిరి నియోజకవర్గం పేరు చెప్పగానే ఠక్కున ఇప్పుడు నారా లోకేష్ గుర్తుకు వస్తున్నారు. నియోజక వర్గంలో చేపడుతున్న పనులు కావొచ్చు..…
మాములుగా కొత్త సినిమాల విడుదల రోజు తెల్లవారుఝాము లేదా అర్ధరాత్రి షోలు వేయడం సహజం. కానీ నాలుగో రోజు మిడ్…
గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…
తన ప్రియురాలి కోసం చైన్ స్నాచింగ్స్ దొంగగా మారిన ఒక ప్రియుడు... బైకుల మీద స్పీడుగా వెళుతూ మహిళల మెడల…