సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా టైటిల్ గురించి నెల రోజులుగా విపరీతమైన చర్చ జరుగుతోంది. ఈ సినిమాకు అమ్మపాట, భారతంలో అర్జునుడు.. లాంటి టైటిళ్లు ఇంతకుముందు ప్రచారంలోకి వచ్చాయి. ఈ టైటిళ్ల విషయంలో అభిమానుల నుంచి అంత సానుకూల స్పందన కనిపించలేదు. కొన్ని రోజుల హడావుడి తర్వాత ఈ చర్చ ఆగింది. కానీ ఇప్పుడు మళ్లీ ఈ సినిమా టైటిల్ గురించి పెద్ద డిస్కషన్ నడుస్తోంది.
త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘అమరావతికి అటు ఇటు’ అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నారని.. కానీ తర్జన భర్జనలు నడుస్తున్నాయని అంటున్నారు. ఐతే లాజికల్‌గా ఆలోచిస్తే ఈ సినిమాకు ఈ టైటిల్ పెట్టే అవకాశాలు ఎంతమాత్రం లేవని అర్థమైపోతుంది.
అమరావతి అనగానే ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారమే గుర్తుకొస్తుంది అందరికీ. దాని మీద నాలుగేళ్లుగా నడుస్తున్న పొలిటికల్ డ్రామా అంతా తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో అదే ప్రధాన అంశంగా మారేలా కనిపిస్తోంది. అమరావతి వ్యవహారంలో జగన్ సర్కారు మూటగట్టుకున్న అప్రతిష్ట అంతా ఇంతా కాదు. ఇప్పుడు మహేష్ సినిమాకు ఏ ఉద్దేశంతో ‘అమరావతికి అటు ఇటు’ అనే టైటిల్ పెట్టినా.. అది రాజకీయ రంగు పులుముకుంటుంది.
రాజకీయంగా మహేష్ ఎంత న్యూట్రల్‌గా ఉంటాడో తెలిసిందే. ఏమాత్రం వివాదాల జోలికి వెళ్లడు. ఇప్పుడు ఇలాంటి టైటిల్ పెట్టి అనవసరంగా తన సినిమాకు రాజకీయ రంగు అంటించుకోవడానికి మహేష్ ఎంతమాత్రం ఇష్టపడడు. కాబట్టి త్రివిక్రమ్ ఈ టైటిల్ ఖరారు చేసే అవకాశాలు లేవని ఫిక్సయిపోవచ్చు. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను శ్రీరామనవమికి లాంచ్ చేస్తారని అంటున్నారు.
This post was last modified on March 26, 2023 6:29 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…