మెగా ఆస్థాన దర్శకుడికే పగ్గాలు!

మెగాస్టార్ తో ఎప్పుడైనా సినిమా తీయడానికి అందుబాటులో ఉండే వి.వి. వినాయక్ మళ్ళీ మెగాస్టార్ సినిమాకు పగ్గాలు చేపడుతున్నాడా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. లూసిఫర్ రీమేక్ నుంచి సుజీత్ తప్పుకున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ తో సినిమా చేయడానికి సాహో దర్శకుడు యు.వి. కాంపౌండ్ కి వెళ్ళిపోయాడు. ఆచార్య షూటింగ్ పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది కనుక, ఒక రీమేక్ కథపై అన్నాళ్ళు కాలయాపన చేయడం కరెక్ట్ కాదని భావించి సుజీత్ వెళ్ళిపోయాడట. దాంతో లూసిఫర్ ఆగిపోయినట్టేనని వెబ్ లో వార్తలొచ్చాయి. కానీ ఆ మాస్ పాత్ర చేయడానికి చిరంజీవి ఫిక్సయ్యారు.

తన ఏజ్ కి తగ్గ పాత్ర కనుక ఆచార్య తర్వాత అదే చేస్తారు. మాస్ సినిమాలు తీయడంలో అనుభవం ఉన్న వినాయక్ అయితే బాగా హేండిల్ చేస్తాడని అతనికి భాద్యతలు అప్పగించినట్టు పుకార్లు వినిపిస్తున్నాయి. వినాయక్ ఫామ్ లో లేకపోయినా కానీ ఠాగూర్, ఖైదీ నంబర్ 150 చిత్రాలను విజయవంతంగా రీమేక్ చేసాడు కనుక లూసిఫర్ కూడా అతని చేతిలో పెడుతున్నట్టు టాక్.

CLICK HERE!! For the Latest Updates on all the OTT Content