తమిళనాడులో భారీ రికార్డులతో బాక్సాఫీస్ బద్దలు కొట్టిన పొన్నియన్ సెల్వన్ 1 బయట రాష్ట్రాల్లో పెద్దగా ఆడలేదన్న సంగతి తెలిసిందే. కథలో ఉన్న సంక్లిష్టత, చోళుల నేపథ్యం పట్ల ఇతర ఆడియన్స్ కి పెద్దగా అవగాహన లేకపోవడం, వీటిని మించి దర్శకుడు మణిరత్నం టిపికల్ స్క్రీన్ ప్లే దీన్ని ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లలేకపోయాయి. అయినా సరే రెండో భాగం మీద లైకా సంస్థ చాలా నమ్మకంగా ఉంది. అసలైన స్టోరీ ఇందులోనే ఉంటుంది కాబట్టి భాషతో సంబంధం లేకుండా అందరూ ఆదరిస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. అయితే దీనికి సంబంధించిన ఒక అప్డేట్ షాక్ ఇచ్చేలా ఉంది.
థియేట్రికల్ వెర్షన్ కు సంబంధించి ఫైనల్ కట్ ని 3 గంటల 53 నిమిషాలకు ఫైనల్ చేశారట. ఇది చాలా అంటే చాలా ఎక్కువ. ఎడిటింగ్ డిపార్ట్ మెంట్ తో రోజుల తరబడి కూర్చున్నాకే ఈ లెన్త్ ని సెట్ చేశారట. అయితే ప్రాక్టికల్ గా ఇంత లెన్త్ ని ఇప్పటి ఆడియన్స్ భరించలేరు. ఒకప్పుడు దానవీరశూరకర్ణ, బెన్ హర్, హం ఆప్కె హై కౌన్, లగాన్, మేరా నామ్ జోకర్ లాంటి వాటిని రెండేసి ఇంటర్వెల్స్ తో ప్రదర్శించేవారు. కానీ ఇప్పుడలా చేయలేం. పైగా నాలుగు గంటలంటే రోజు వేయాల్సిన షోల కౌంట్ తగ్గిపోవడంతో పాటు రెవిన్యూ కూడా దెబ్బ తింటుంది.
సో అర్జెంట్ గా ఓ యాభై నిముషాలు కత్తెర వేస్తే తప్ప లాభం లేదు. కానీ మణిరత్నం దానికి ఒప్పుకోవడం లేదని చెన్నై టాక్. ఇంకో వారంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఒకవేళ సాధ్యమైతే అంతమేరకు తగ్గించి అమెజాన్ ప్రైమ్ లో కట్స్ లేకుండా పూర్తి కాపీ విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంటారట. సోషల్ మీడియాలో దీని మీద మీమ్స్ వచ్చేశాయి. దుప్పటి తీసుకుని వెళ్లాల్సి ఉంటుందని ఫస్ట్ పార్ట్ కే నిద్రపోయిన మాకు ఇప్పుడీ రెండో భాగం అంతకన్నా ఎక్కువ కునుకు ఇస్తుందని చురకలు వేస్తున్నారు. వీటి సంగతి ఎలా ఉన్నా మణిరత్నం ధీమా చూస్తుంటే ఏదో బలమైన మ్యాటరే ఉంది.
This post was last modified on March 26, 2023 12:45 pm
భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…
నిన్న ఉన్నట్టుండి ఆదర్శ కుటుంబం ఏకె 47 పండగ బరి నుంచి తప్పుకుందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. ఇంకా…
స్వంత కుటుంబం సినిమా. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించి పక్క భాషనుంచి ఫహద్ ఫాసిల్ ని తీసుకొచ్చి తీసిన మూవీ. పైగా…
కొత్త సినిమా రిలీజ్ అంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతిదానికి ఎంతో కొంత ఓపెనింగ్ ఇచ్చే ప్రేక్షక వర్గం…
దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…