టాలీవుడ్ చరిత్రలోనే చాలా కొద్దిమందికి మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్‌ను సమంత సొంతం చేసుకుంది. ఆమెను నమ్మి మంచి బడ్జెట్లు పెట్టి వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు నిర్మిస్తున్నారు నిర్మాతలు. వాటికి మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి.
యుటర్న్ ఓ మోస్తరుగా ఆడితే.. ఓ బేబీ, యశోద చిత్రాలు సూపర్ హిట్టయ్యాయి. ఇప్పుడు ఆమె ప్రధాన పాత్రలో ‘శాకుంతలం’ లాంటి భారీ చిత్రం తెరకెక్కింది. ఇంకో 20 రోజుల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో సమంత ప్రమోషన్ల సందడి మొదలుపెట్టింది. ఒక ఇంటర్వ్యూలో ఆమె.. ‘శాకుంతలం’ కథ చెప్పినపుడు తాను చేయలేనని దర్శక నిర్మాత గుణశేఖర్‌కు చెప్పినట్లు వెల్లడించింది.
‘‘అవును. ముందు గుణశేఖర్ గారు నాకీ కథ చెప్పగా.. నేను చేయలేనని సున్నితంగా తిరస్కరించాను. నేను ఇలాంటి సినిమాకు న్యాయం చేయలేనని అనుకున్నా. కానీ గుణశేఖర్ గారు నా ఆలోచనను మార్చి ఈ సినిమా చేయించారు. ఈ సినిమా మిస్సయి ఉంటే నేనొక పెద్ద కలను నెరవేర్చుకోలేకపోయేదాన్ని’’ అని సమంత అంది.
ఇక మయోసైటిస్ వ్యాధితో తన పోరాటం గురించి సామ్ వివరిస్తూ.. ‘‘యశోద సినిమా చేస్తున్న సమయంలో అనారోగ్యం పాలయ్యాను. ఒక టైంలో ఓపిక బాగా తగ్గిపోయింది. చాలా మందులు వాడుతూ నీరసపడిపోయేదాన్ని. మందులేసుకుంటూనే చిత్రీకరణకు హాజరయ్యా, ప్రమోషన్లు కూాడా చేశా. కానీ తర్వాత కోలుకున్నా. ఇప్పుడు అంతా బాగుంది. ‘శాకుంతలం’ ప్రమోషన్లు బాగానే చేయగలుగుతున్నా. ‘ఖుషి’ సినిమా షూటింగ్‌లోనూ పాల్గొంటున్నా’’ అని సామ్ చెప్పింది.
This post was last modified on March 25, 2023 8:57 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…