రామ్ చరణ్ పుట్టినరోజుని పురస్కరించుకుని ప్రత్యేకంగా రీ రిలీజ్ చేస్తున్న ఆరంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ షాకిచ్చేలా ఉన్నాయి. హైదరాబాద్ క్రాస్ రోడ్స్ తో మొదలుపెట్టి విజయవాడ అలంకార్ థియేటర్ దాకా టికెట్లు వేగంగా అమ్ముడుపోతున్నాయి.
దీనికొచ్చే వసూళ్ళన్నీ జనసేనకు విరాళంగా ఇవ్వడం జరుగుతుందని నిర్మాత నాగబాబు ముందే ప్రకటించడం ఫ్యాన్స్ కి కనెక్ట్ అయ్యింది. ఇంత పెద్ద డిజాస్టర్ లో ఉన్న ఒకే ఒక్క పాజిటివ్ పాయింట్ హరీష్ జైరాజ్ పాటలు. వాటికి చరణ్ వేసిన స్టెప్స్ ని బిగ్ స్క్రీన్ మీద ఎంజాయ్ చేయడానికి రెడీ అవుతున్నారు.
మాములుగా చెప్పుకుంటే ఆరంజ్ ఇప్పుడు కూడా బోర్ కొట్టే సినిమానే. జెనీలియా ఓవరాక్షన్ తో పాటు సాగదీసిన ఫస్ట్ హాఫ్ లో చాలా సేపు విసుగు తెప్పించే సన్నివేశాలు ఉంటాయి. మాస్ జనాలు ఎంజాయ్ చేసే మూమెంట్స్ ఒక్కటీ ఉండవు. ఇక ఫైట్ల సంగతి సరేసరి.
దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ లవ్ ట్రాక్స్ మీద తప్ప ఇంక దేని మీదా దృష్టి పెట్టకపోవడంతో కమర్షియల్ అంశాలకు చోటు లేకుండా పోయింది. అయినా సరే ప్యూర్ లవ్ ని చూపించిన అతికొద్ది సినిమాల్లో ఆరంజ్ ది ప్రత్యేక స్థానమని మూవీ లవర్స్ ఫీలవుతుంటారు. అందుకే ఇంత క్రేజ్ కాబోలు
కేవలం బ్లాక్ బస్టర్లే కాకుండా పాటలు బాగున్నా ఫ్లాప్ మూవీస్ ని కూడా రిలీజ్ చేసుకోవచ్చన్న క్లారిటీ ఇప్పుడీ ఆరంజ్ వల్ల వచ్చేసింది. ఈ లెక్కన భవిష్యత్తులో తీన్ మార్ లాంటివి వచ్చినా ఆశ్చర్యం లేదు.
తమ హీరో సినిమాకు ఎంత రీ రిలీజ్ అయినా సరే కలెక్షన్లు భారీగా రావాలన్న ఉద్దేశంలో ఈ ట్రెండ్ ని ఫ్యాన్స్ పర్సనల్ గా తీసుకోవడం ఈ బజ్ కి కారణం అవుతోంది. దానికి తోడు సోషల్ మీడియాలో వసూళ్ల ఫిగర్లను గర్వంగా చెప్పుకోవటానికి, ఆన్ లైన్ బుకింగ్స్ స్క్రీన్ షాట్లను చూపించుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ ప్రహసనం ఇప్పట్లో ఆగేలా లేదు
This post was last modified on March 25, 2023 8:54 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…