పూజా కాళ్ళ మీద పడిపోయారు!

పూజ హెగ్డే కాళ్ళ పిచ్చి టాలీవుడ్ కి పట్టించాడు త్రివిక్రమ్. అంతకుముందు ఈ పొడుగు కాళ్ళ సుందరి కాళ్ళను ఎవరూ అంతగా హైలైట్ చేయలేదు. అల వైకుంఠపురములో సినిమాలో పూజ కాళ్ళ మీద సీన్లు రాయడమే కాదు… ఏకంగా ఒక పాటే పెట్టేసారు. పూజ కూడా తన కాళ్ళకు ఇచ్చిన ప్రాముఖ్యతను చాటుకుంటూ ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో పదకొండు మిలియన్ల ఫాలోయర్స్ వచ్చినపుడు కాళ్ళతో థాంక్స్ చెప్పింది.

తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ చిత్రం పోస్టర్లో కూడా పూజ కాళ్ళను హైలైట్ చేసారు. అఖిల్ చెవులను తన కాళ్ళతో గిల్లుతోన్న రొమాంటిక్ స్టిల్ రిలీజ్ చేసారు. ఇందులోనే ఆమె కాళ్ళకి ఉన్న క్రేజ్ చెప్పకనే చెప్పేసారు. ఈ చిత్రంలో పూజ చాలా గ్లామరస్ గా కనిపిస్తుందని టాక్. బొమ్మరిల్లు భాస్కర్ సినిమాల్లో హీరోయిన్లు ఇలా కనిపించరు. కానీ ఇప్పుడు తనకు విజయం అత్యవసరం కాబట్టి అందుకోసం ఉన్న ఏ ఒక్క అవకాశం వదులుకుంటున్నట్టు లేడు.