నాని దసరా మరో వారంలో థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ సినిమా కోసం నేచురల్ స్టార్ మాస్ అవతారమెత్తాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన దసరా లో స్నేహం తాలూకు ట్విస్ట్ ఉండబోతుందని అంటున్నారు. ఆ ట్విస్ట్ సెన్సార్ ద్వారా ఇప్పుడు లీక్ చేయబడింది. సహజంగా సెన్సార్ బోర్డ్ మెంబర్స్ సినిమా చూశాక వారికి అనిపించిన అభ్యంతరాలు తెలియజేసి వాటిని ట్రిమ్ చేయమని చెప్తారు. ఎక్కువ మట్టికి డైలాగులే ఇందులో ప్రదానంగా పాయింట్ అవుట్ చేస్తుంటారు.
తాజాగా దసరాను సెన్సార్ బోర్డ్ సభ్యులు చూడటం జరిగింది. చూసి వారికి అనిపించిన డైలాగులు మ్యూట్ చేయాలని అలాగే కొన్ని షాట్స్ కట్ చేయాలని కోరారు. ముఖ్యంగా బాడ్ కవ్ , బెంచత్ వంటి బూతులను తొలగించాలని కోరారు. ఇంకా అలాంటి డైలాగులను అండర్ లైన్ చేసి మ్యూట్ చేసుకోవాలని తెలిపారు. అక్కడి వరకూ బాగానే ఉంది. కానీ సినిమాలో సూరి పాత్ర చనిపోయాక డెడ్ బాడీ ను చూపించే షాట్ పై సెన్సార్ బోర్డ్ అభ్యంతరం చెప్పింది. సినిమాలో ధరణి కి సూరి అనే ఫ్రెండ్ ఉంటాడు. ఆ పాత్రను దీక్షిత్ శెట్టి చేశాడు. ఆ పాత్ర చుట్టూనే అసలు కథ నడుస్తుందని ఇప్పటికే కొన్ని లీకులు తిరుగుతున్నాయి. తాజాగా సెన్సార్ కాపీలో సూరి డెడ్ బాడీ అని ఉండటంతో సినిమాలో ఆ ట్విస్ట్ బయటికొచ్చేసింది.
సెన్సార్ కట్స్ చెప్పిన కాపీ ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంతో సూరి డెడ్ బాడీ అనే లైన్ ను అండర్లైన్ చేసి మరీ నెటిజన్లు స్ప్రెడ్ చేస్తున్నారు. ఏదేమైనా దసరాలో మెయిన్ ట్విస్ట్ ఇదే అయితే సెన్సార్ అభ్యంతరం ద్వారా అది లీకయినట్టే మరి.
This post was last modified on March 25, 2023 6:52 am
సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…
ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…
నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…
రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…