ఈ మధ్య కాలంలో పెద్దగా అంచనాల్లేకుండా, ప్రమోషన్లు కూడా లేకుండా విడుదలై.. కేవలం మౌత్ టాక్‌తో పుంజుకుని పెద్ద విజయం సాధించిన చిన్న సినిమా అంటే.. బలగం అనే చెప్పాలి. అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించినప్పటికీ ఈ సినిమాకు రిలీజ్ ముందు పెద్ద పబ్లిసిటీ ఏమీ చేయలేదు. ఆయన స్టయిల్లో పెద్ద బడ్జెట్ కూడా పెట్టలేదు.
తమిళం, మలయాళంలో వచ్చే సహజమైన నేటివిటీ ఉన్న సినిమాలను గుర్తు చేస్తూ ఈ సినిమా తెలంగాణ వారినే కాక అందరినీ ఆకట్టుకుంది. నైజాంలో ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. పెట్టుబడి మీద కొన్ని రెట్ల లాభాన్ని తెచ్చిపెట్టింది. తొలి వారం కంటే రెండో వారంలో ఈ సినిమా వసూళ్లు ఎక్కువ ఉన్నాయి. మూడో వారంలో కూడా నిలకడగా కలెక్షన్లు రాబడుతూ సాగుతోందీ చిత్రం. కానీ ఇంతలో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేస్తుండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఐతే ఈ సినిమా ఇంత బాగా ఆడేస్తుందని దిల్ రాజుకు కూడా అంచనా లేనట్లుంది. అందుకే థియేట్రికల్ రిలీజ్ తర్వాత మూడు వారాలకు ఓటీటీలో విడుదల చేయడానికి ఒప్పందం చేసుకున్నారు. అమేజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా ఈ శుక్రవారమే రిలీజ్ అవుతున్న విషయం అధికారికంగా వెల్లడైంది. కానీ ఈ విషయం చిత్ర హీరోయిన్లు ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్‌లకు తెలియకపోవడం గమనార్హం. అమేజాన్ ప్రైమ్‌లో సినిమా రిలీజ్ కానున్న విషయాన్ని ఎవరో ప్రస్తావిస్తే.. అది నిజం కాదని, ఈ రూమర్లు నమ్మొద్దని, సినిమాను థియేటర్లకు వెళ్లి చూడాలని అతను సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. కావ్య సైతం ఇలాగే సినిమాను ప్రమోట్ చేసింది.
కానీ తీరా చూస్తే ప్రైమ్ అధికారికంగా ఈ సినిమా డిజిటల్ రిలీజ్ గురించి ప్రైమ్ వాళ్లు అధికారిక ప్రకటన ఇచ్చారు. దీన్ని బట్టి మూడు వారాలకే ఓటీటీ రిలీజ్ విషయం హీరో హీరోయిన్లు సహా టీంలోని ముఖ్యులకే తెలియదన్నమాట.
This post was last modified on March 24, 2023 9:21 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…