ఒక హీరో కొన్ని విజయాలందుకుని, కొంత స్టార్ ఇమేజ్, ఫాలోయింగ్ సంపాదించాడంటే.. ఆటోమేటిగ్గా తన పేరు వెనుక ఒక ట్యాగ్ వచ్చేస్తుంది. వారసత్వ నేపథ్యంతో వచ్చే హీరోల సంగతైతే చెప్పాల్సిన పనే లేదు. ఒకట్రెండు సినిమాలకే ట్యాగ్ పడిపోతోంది.
ఐతే ఇప్పుడు ఓ సీనియర్ హీరో 50 ఏళ్ల సినీ ప్రస్థానం తర్వాత కొత్తగా ఇప్పుడు తన పేరు పక్కన ఒక ట్యాగ్ వేసుకున్నాడు. ఆ నటుడు నరేష్ కాగా.. ఆయన పేరు వెనక వచ్చి చేరిన ట్యాగ్.. నవరసరాయ. నరేష్.. ఆయనతో కలిసి జీవిస్తున్న పవిత్ర నరేష్ జంటగా ‘మళ్ళీ పెళ్ళి’ అనే సినిమా చేస్తున్న సంగతి తాజాగా వెల్లడైంది.
ఈ రోజే సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను స్వయంగా నరేషే నిర్మిస్తుండటం విశేషం. ఈ పోస్టర్ మీద నరేష్ పేరు ముందు ‘నవరసరాయ’ అనే ట్యాగ్ జోడించారు. 50 ఏళ్ల ఆయన ఘన సినీ ప్రస్థానాన్ని గుర్తు చేశారు. నరేష్ తెలుగు సినిమా చరిత్రలోనే మేటి నటుల్లో ఒకడనడంలో సందేహం లేదు. హీరోగానే కాక క్యారెక్టర్ ఆర్టిస్టుగా అద్భుతమైన పాత్రలు చేశాడు. తన దగ్గరికొచ్చిన ప్రతి పాత్రకూ న్యాయం చేశాడు. పాత్రల్లో ఆయన చూపించే వేరియేషన్ అసాధారణం.
ఐతే హీరోగా ఎన్నో విజయాలందుకుని ఓ మోస్తరు స్టార్ ఇమేజ్ కూడా సంపాదించినప్పటికీ.. ఏ రోజూ నరేష్ తన పేరు వెనుక బిరుదులు చేర్చుకున్నది లేదు. కానీ ఇప్పుడు ఈ వయసులో లీడ్ రోల్ చేస్తూ.. వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో వ్యతిరేకత ఎదుర్కొంటున్న టైంలో ఇలా తన పేరు ముందు బిరుదు తగిలించుకోవడంతో కొంత ట్రోలింగ్‌కు గురవుతున్నారు.
ఆ సంగతి పక్కన పెడితే.. నరేష్ తన వ్యక్తిగత జీవితంతో ముడిపెట్టి ‘మళ్ళీ పెళ్ళి’ అనే సినిమా తీయడం.. దానికి సీనియర్ దర్శక నిర్మాత ఎం.ఎస్.రాజు దర్శకత్వం వహిస్తుండటం మాత్రం ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించేదే.
This post was last modified on March 24, 2023 8:53 pm
మంగళగిరి నియోజకవర్గం పేరు చెప్పగానే ఠక్కున ఇప్పుడు నారా లోకేష్ గుర్తుకు వస్తున్నారు. నియోజక వర్గంలో చేపడుతున్న పనులు కావొచ్చు..…
మాములుగా కొత్త సినిమాల విడుదల రోజు తెల్లవారుఝాము లేదా అర్ధరాత్రి షోలు వేయడం సహజం. కానీ నాలుగో రోజు మిడ్…
గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…
తన ప్రియురాలి కోసం చైన్ స్నాచింగ్స్ దొంగగా మారిన ఒక ప్రియుడు... బైకుల మీద స్పీడుగా వెళుతూ మహిళల మెడల…