‘దసరా’ సినిమాతో పెద్ద సాహసమే చేస్తున్నాడు నేచురల్ స్టార్ నాని. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కాబోతోంది. నాని సినిమాలు వేరే భాషల్లో రిలీజ్ కావడం కొత్తేమీ కాదు. అతను తెలుగు, తమిళంలో ఓ ద్విభాషా చిత్రం చేశాడు. అతడి మరికొన్ని సినిమాలు తమిళంలో రిలీజయ్యాయి. కొన్ని హిందీలో డబ్ అయ్యాయి. ‘అంటే సుందరానికీ’ మలయాళంలో రిలీజైంది. కానీ ఈసారి అతను పూర్తి స్థాయి పాన్ ఇండియా చిత్రంలో నటించాడు. ఆరంభమైన దగ్గర్నుంచి ‘దసరా’ను పాన్ ఇండియా సినిమాగానే ప్రమోట్ చేస్తున్నారు. ఇక రిలీజ్ ముంగిట ప్రమోషన్లు చూసి.. ఏంటీ దూకుడు అని అందరూ ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చింది.
నాని ముంబయి, బెంగళూరు, చెన్నై, కోచి.. ఇలా నాలుగు సిటీలు ఎంచుకుని ఒక్కో గంట పాటు ప్రెస్ మీట్లు పెట్టి వచ్చేస్తాడని అనుకున్నారు. కానీ అతను గట్టి ప్లానింగ్‌తోనే రంగంలోకి దిగాడు. ఉత్తరాదిన లక్నో సహా వేర్వేరు నగరాల్లో తిరిగాడు. సౌత్‌కు వచ్చి ఇక్కడ పలు చోట్ల ప్రమోషన్లు చేస్తున్నాడు. సినిమా పాన్ ఇండియా అంటే సరిపోదు.. ప్రమోషన్ కూడా పాన్ ఇండియా అనిపించాలి అని నానిని చూస్తే అర్థమవుతుంది. హీరోగా నాని ఎదుగుదల ఒక ఆదర్శమైతే.. ఇప్పుడు ప్రమోషన్ల విషయంలో అతను అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
ఐతే నాని పడ్డ కష్టానికి ఎంతమేర ఫలితం దక్కుతుందన్న దాని మీదే ఇప్పుడు అందరి దృష్టీ నిలిచి ఉంది. ‘దసరా’ ప్రమోషనల్ కంటెంట్, నాని కష్టం తెలుగు రాష్ట్రాల అవతల ప్రేక్షకుల్లో ఏమాత్రం ఆసక్తి రేకెత్తించి ఉంటుంది.. మిగతా భాషల్లో ఈ సినిమాకు ఓపెనింగ్స్ ఎలా ఉండబోతున్నాయి అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఐతే ఒకేసారి అద్భుతాలు ఆశించలేం కానీ.. ‘పుష్ప’ సినిమాలాగా కంటెంట్ కనెక్ట్ అయితే.. నెమ్మదిగా సినిమా గట్టి ప్రభావం చూపే అవకాశాలను కొట్టిపారేయలేం.
This post was last modified on March 24, 2023 6:49 pm
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…