సూపర్ హీరోస్ సినిమాల్లాగే హాలీవుడ్ యాక్షన్ మూవీ లవర్స్ కు ఎంతో ఇష్టమైన సిరీస్ జాన్ విక్. ఇప్పటిదాకా ఈ పేరు మీద మూడు భాగాల సినిమాలు వచ్చాయి. అన్నీ బ్లాక్ బస్టర్లే. తాజాగా నాలుగోది మరియు ఆఖరిది చాప్టర్ 4 ఇవాళ థియేటర్లలో విడుదలయ్యింది. ముందు రోజు సాయంత్రమే ఇండియా వైడ్ స్పెషల్ ప్రీమియర్లు వేస్తే హైదరాబాద్ లాంటి నగరాలతో మొదలుకుని కర్నూలు లాంటి చిన్న పట్టణాల దాకా అన్ని షోలు ఫుల్ అయ్యాయంటే ఈ పాత్ర పోషించిన కీన్ రీవ్స్ మీద మన దేశంలోనూ ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
జాన్ 4 ముందు పార్ట్స్ కి ఖచ్చితమైన కొనసాగింపు. మాఫియాని నడిపించే హైటేబుల్ మీద ప్రతీకారం కోసం ఎదురు చూస్తుంటాడు జోనాథన్ అలియాస్ జాన్ విక్(కీన్ రీవ్స్). ఈ క్రమంలో ఇతని శత్రువుల కుట్రల వల్ల వేర్వేరు దేశాల్లో ఉన్న జాన్ స్నేహితులు ఒక్కొక్కరుగా తీవ్రంగా నష్టపోతారు. ఈలోగా జాన్ విక్ ని సజీవంగా లేదా చంపేసి తీసుకొచ్చిన వాళ్లకు 40 మిలియన్ల అమెరికన్ డాలర్ల ప్రైజ్ మనీ ప్రకటిస్తారు. ఇక్కడి నుంచి అసలు ఆట మొదలువుతుంది. కథ కంటే ఎక్కువగా దర్శకుడు చాద్ స్టాహెల్కీ యాక్షన్ మీద పెట్టిన శ్రద్ధ అద్భుత ఫలితాన్ని ఇచ్చింది.
మొత్తం 2 గంటల 50 నిమిషాల సుదీర్ఘ నిడివితో ఉన్న ఈ రేసీ థ్రిల్లర్ లో ప్రతిపావు గంటకు మతిపోగోట్టే రీతిలో ఫైట్లు ఛేజులు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా చివరి నలభై అయిదు నిమిషాలు చూపు పక్కకు తిప్పుకోవడం కష్టమే. లాజిక్స్ ని గాలికి వదిలేసి జాన్ విక్ విన్యాసాలు చూస్తూ ఉంటే టైం ఇట్టే గడిచిపోతుంది. పారిస్ లో షూట్ చేసిన పోరాట సన్నివేశాలు అంత సులభంగా మర్చిపోలేం. సరదాగా సాగే ఎంటర్ టైన్మెంట్ ని మాత్రం ఇందులో ఆశించకూడదు. ఫ్యాన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిరాశచెందే అవకాశమే లేని జాన్ విక్ మూవీ రికార్డులు కొట్టేలాగే ఉంది.
This post was last modified on March 24, 2023 6:44 pm
ఒకప్పుడు ఏ మాయ చేశావే, ఘర్షణ లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గౌతమ్ మీనన్ ఇప్పుడు మనుగడ…
టాలీవుడ్లో చాలా ఏళ్ల నుంచి సరైన బాక్సాఫీస్ విజయం లేక ఇబ్బంది పడుతున్న పెద్ద సినీ ఫ్యామిలీస్‌లో అక్కినేని వారిది…
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఏదైనా చెబితే అది జరిగేలా పక్కా ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ, ఎందుకో కానీ.. ఆయన…
గత ఏడాది డిసెంబరు మొదటి వారంలో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పుష్ప: ది రూల్’ దేశవ్యాప్తంగా…
వైసీపీలోనే కాకుండా దాదాపుగా తెలుగు నేలకు చెందిన అన్ని రాజకీయ పార్టీల్లో ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసంపైనే…
దక్షిణాదిలో లెజెండరీ డైరెక్టర్స్ అని ప్రస్తావించాల్సిన వాళ్లలో ఖచ్చితంగా రాయాల్సిన పేరు మణిరత్నం. సౌత్ సినిమా దశాదిశను మార్చేలా ఆయన…