త్రివిక్రమ్ దగ్గర చాలా మంది పని చేశారు. కానీ శిష్యుడిగా క్లిక్ అయ్యింది మాత్రం వెంకీ కుడుములనే. వెంకీ కుడుముల మొదటి సినిమా ‘ఛలో’ ట్రైలర్ లాంచ్ కొచ్చి ఛలో హిట్ కొట్టు అంటూ వెంకీ కి బూస్టప్ ఇచ్చాడు త్రివిక్రమ్. ఆ ఈవెంట్ తోనే వెంకీ త్రివిక్రమ్ దగ్గర వర్క్ చేశాడని అందరికీ తెలిసింది. వెంకీ కుడుముల తీసిన భీష్మ చూస్తే త్రివిక్రమ్ మార్క్ బాగా కనిపిస్తుంది. మేకింగ్ తో పాటు వీరిద్దరికీ మరో మేటర్ కూడా సింకయింది. ఒకే హీరోయిన్ తో మూడు సినిమాలు చేస్తూ రిపీట్ చేయడం వీరిద్దరిలో కనిపించే కామన్ క్వాలిటీ.
అవును అరవింద సామెత నుండి ఇప్పుడు చేస్తున్న మహేష్ సినిమా వరకూ పూజ హెగ్డే ను హీరోయిన్ గా రిపీట్ చేస్తునే ఉన్నాడు త్రివిక్రమ్. ఇక గురువు దారిలోనే నడుస్తూ తను కూడా ఒకే హీరోయిన్ తో మూడు సినిమాలు చేస్తున్నాడు వెంకీ. ప్రస్తుతం వెంకీ నితిన్ తో మరో సినిమా ప్లాన్ చేసుకున్నాడు. తాజాగా ఈ కాంబో ఎనౌన్స్ మెంట్ వచ్చింది.
హీరోయిన్ గా రష్మిక నే ఉండబోతుందని ఎనౌన్స్ మెంట్ వీడియోతో ముందే క్లారిటీ ఇచ్చేశాడు వెంకీ. వెంకీ తీసిన ఛలో , భీష్మ రెండు సినిమాలో రష్మిక నే హీరోయిన్. తెలుగులో తనని పరిచయం చేసింది కూడా వెంకీ నే. అందుకే ఆ గౌరవంతో అడిగిన వెంటనే వెంకీ కి రష్మిక డేట్స్ అడ్జస్ట్ చేసి ఉండవచ్చు. త్రివిక్రమ్ , వెంకీ కుడుముల ఇద్దరూ ఒకే హీరోయిన్ తో చేస్తున్న మూడో సినిమా కావడం మరో విశేషం. ఏదేమైనా గురువు మార్గంలోనే నడుస్తూ ఇలా ఒకే హీరోయిన్ ను పదే పదే రిపీట్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు కుడుముల.
This post was last modified on March 24, 2023 4:24 pm
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…