మహానటి తర్వాత విజయ్ , సమంత జంటగా నటిస్తున్న క్రేజీ మూవీ ‘ఖుషి’. ‘మహానటి’లో కాసేపే కనిపించిన ఈ కాంబో ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ లవ్ కం ఫ్యామిలీ ఎంటర్టైన్ తో ఖుషి చేయబోతుంది. అయితే ఈ సినిమాకు సంబందించి నంబర్ సెంటిమెంట్ ఒకటి ఫోకస్ గా కనిపిస్తుంది. అదే రెండు నంబర్ సెంటిమెంట్. అవును ఈ సినిమా చుట్టూ రెండు అంకె తిరుగుతుంది.
విజయ్ దేవరకొండ , సమంత కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత నటిస్తున్న రెండో చిత్రమిది. ఇక విజయ్ ‘డియర్ కామ్రేడ్’ తర్వాత మైత్రిలో చేస్తున్న సినిమా కావడంతో అక్కడ కూడా రెండు నంబర్ ఉంది. ఇలా మూడు విషయాల్లో రెండు నంబర్ ఖుషి చుట్టూ చక్కర్లు కొడుతుంది.
ఖుషి టైటిల్ తో పవన్ బ్లాక్ బస్టర్ సెంటిమెంట్ ఎలనూ ఉంది ఇప్పుడు దానికి రెండు నంబర్ సెంటిమెంట్ కూడా తోడైంది. మరి విజయ్ -మైత్రి సినిమా అనేది తప్ప మిగతా రెండు వర్కవుట్ అయ్యాయి. మరి ఆ సెంటిమెంట్ వర్కవుట్ అయితే ఖుషి పెద్ద హిట్ కొట్టినట్టే. పైగా సెప్టెంబర్ లో పెద్దగా రిలీజ్ లు లేని టైమ్ చూసి రిలీజ్ చేస్తున్నారు. టాక్ ఏ మాత్రం బాగున్నా మంచి వసూళ్లు తెచ్చుకోవడం ఖాయం.
This post was last modified on March 24, 2023 4:21 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…