మావయ్య పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో రూపొందుతున్న వినోదయ సితం రీమేక్ డేట్ జూలై 28 లాక్ చేసి అఫీషియల్ గా ప్రకటించారు. ఇకపై వరసగా అప్డేట్లు ఇస్తూ అభిమానులతో టచ్ లో ఉండేలా ప్రొడక్షన్ టీమ్ స్ట్రాటజీని సిద్ధం చేసుకొంటోంది.. దీనికి దేవుడు టైటిల్ పరిశీలనలో ఉండగా మాటల రచయిత త్రివిక్రమ్, దర్శకుడు సముతిరఖని ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. దేవరా అనుకున్నప్పటికీ దానికన్నా మొదటిదే బాగుందని ఫీలయ్యారట. ఈ వార్త కొద్దివారాల క్రితమే బయటికి వచ్చినా కన్ఫర్మ్ కాలేదు.
ప్రస్తుతం మధ్య మధ్యలో జనసేన వల్ల చిన్న చిన్న బ్రేకులు పడుతున్నా చిత్రీకరణ నాన్ స్టాప్ గా జరుగుతోంది. పవన్ లేని ఎపిసోడ్లను వేగంగా పూర్తి చేస్తున్నారు. జూన్ కంతా ఫస్ట్ కాపీ సిద్ధం చేసి ఆపై ఓ నెల రోజులు ప్రమోషన్లు చేసేలా ప్లానింగ్ జరుగుతోంది. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ ఫాంటసీ థ్రిల్లర్ లో పవన్ కి హీరోయిన్ ఉండదు. తేజు చెల్లిగా ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తుండగా జోడిగా కేతిక శర్మని ఎంచుకున్నారు. ఒరిజినల్ వెర్షన్ కి చాలా కీలక మార్పులు చేయడంతో ఫ్యాన్స్ గోపాల గోపాలని మించిన ఎంటర్ టైన్మెంట్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.
జులై 28కి ఇప్పటిదాకా ఎవరూ కర్చీఫ్ వేయలేదు. స్లాట్ ఖాళీగా ఉంది. బాలీవుడ్ మూవీ రాకీ ఔర్ రాణి ప్రేమ్ కహాని ఒకటే షెడ్యూల్ అయ్యుంది. దేవుడు ఎలాగూ ప్యాన్ ఇండియా ప్రాజెక్టు కాదు కాబట్టి దాని వల్ల వచ్చిన ఇబ్బందేమీ లేదు. తమన్ సంగీతం మీద మంచి అంచనాలున్నాయి. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ తర్వాత చేస్తున్న మూవీ కావడంతో వాటిని మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. త్రివిక్రమ్ రచన పరంగా తప్ప ఇంకే వ్యవహారాల్లోనూ ఉండటం లేదు. మహేష్ బాబు సినిమా తాలూకు పనుల వల్ల కేవలం డైలాగులు రాసివ్వడం వరకే పరిమితమయ్యారు.
This post was last modified on March 24, 2023 4:19 pm
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…